రైతుల ఆందోళనలపై కంగనా వ్యాఖ్యలు

జాతీయం

మండిపడ్డ మాజీ ఎంపి సిమ్రాన్‌జిత్‌ సింగ్‌
చండీఘడ్‌ :దేశ రాజధాని న్యూఢల్లీి సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది. కంగనా రనౌత్‌పై పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్‌ మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఘాయిత్యం ఎలా జరుగుతుందో కంగనా రనౌత్‌ను విూరు అడగవచ్చునన్నారు. తద్వారా అఘాయిత్యం ఎలా జరుగుతుందో ప్రజలకు వివరించవచ్చునని ఆయన తెలిపారు. ఆమెకు చాలా అనుభవం ఉందంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై సంగ్రూర్‌ మాజీ లోక్‌సభ సభ్యుడు సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ వ్యంగ్యంగా ఆయన పేర్కొన్నారు. రైతుల ఆందోళనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యాలపై విూ స్పందన ఏమిటని విలేకర్లు అడిగిన ప్రశ్నకు మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్‌ సింగ్‌పై విధంగా స్పందించారు. అకాలీ దళ్‌ మాజీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల కంగనా రనౌత్‌ ఓ జాతీయ విూడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల నిరసనల విషయంలో మోదీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకుంటే బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు భారత్‌లో సైతం ఏర్పడేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ కుట్రలో చైనా, అమెరికా దేశాల ప్రమేయం సైతం ఉందన్నారు. కేంద్రం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన జరిగినప్పుడు మహిళలపై అత్యాచారాలు జరిగాయని.. అలాగే చెట్లకు శవాలు సైతం వేలాడాయని కంగనా రనౌత్‌ గుర్తు చేశారు. కంగనా రనౌత్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనాయకత్వం సైతం స్పందించింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కంగన రనౌత్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్‌ ఖర్గేతోపాటు రాహుల్‌ గాంధీ సైతం విమర్శలు గుప్పించిన విషయం విధితమే. 2020-21 మధ్య రైతుల కోసం కొత్త చట్టాలను తీసుకు రావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో ఢల్లీి సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనల్లో హరియాణా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర రాష్టాల్రకు చెందిన రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు రైతులను కంగనా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. హిమాచాల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ అయితే.. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం సైతం చేసింది. ఇంకోవైపు ఇదే రైతుల నిరసనపై కంగనా గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. రైతులకు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడావంటూ.. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఛండీగఢ్‌ ఎయిర్‌ పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌… కంగనా రనౌత్‌ చెంప చెళ్లు మనిపించిన సంగతి అందరికీ తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *