కాళేశ్వరం(మేడిగడ్డ)ప్రాజెక్టు మరమ్మత్తు విషయంలో వివాదాన్ని పరిష్కరించడం సీఎం రేవంత్ నాయకత్వపటిమకు మచ్చుతునకగా చెప్పవచ్చు. ఏడవ బ్లాక్ లో మూడుచోట్ల కుంగిపోవడం ఎన్నికల ముందే అన్ని పార్టీలకు ప్రధాన అంశంగా మారగా అప్పటి అధికారపక్షం బీఆర్ఎస్ కు గండంగా పరిణమించినది.
ఈ ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ కంపెనీ మరమ్మతులకు అయ్యేఖర్చూ ప్రభుత్వమే భరించాలని శుక్రవారం చేసిన ప్రకటనకు విరుద్ధంగా అయ్యే ఖర్చు 500కోట్ల రూపాయలు తామే భరిస్తామని శనివారం ప్రకటించడం విశేషం. సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ఠి సమావేశంలో ఎల్ అండ్ టీ కంపెనీ ఒప్పుకోవడం సీఎం రాజకీయ చతురతకు తాజా నిదర్శనం.
అధికారం చేపట్టిన నాటి నుంచి రేవంత్ రోజుకోక నిర్ణయం తీసుకోవడం,అది ప్రజలు హర్షించేవి కావడంవిశేషం.ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి తార్కాణాలు.అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన యువతను ఆకట్టు కుంది. మేడిగడ్డ వివాదం బీఆర్ఎస్ తలకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
ఎల్ అండ్ టీ కంపెనీ తాము మరమ్మతు ఖర్చు పెట్టుకోమని, ప్రభుత్వమే భరించాలని చేసిన ప్రకటన బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టింది.కాని దానిని రాజకీయ అంశంగా మార్చుకోకుండా వారితో చర్చించి వారే మరమ్మతు ఖర్చు పెట్టుకునేలా సమస్యను పరిష్కరించడం ఆయన రాజనీతికి ఉదాహరణ. నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఎంతో అనుభవం ఉన్న వాడిలా సమస్య లను ప్రజలు మేచ్చేవిధంగా, అందరికీ ఆమోదయోగ్యం కలిగేలా నిర్ణయించడం ఆయన రాజనీతికీ తార్కాణం.
ఏదిఏమైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడం, పార్టీలో ఏకైక నాయకుడిగా రేవంత్ ఆవిర్భవించడం జరిగింది. అధిష్టానం కూడా ఆమోదించడం సీనియర్లు ప్రజాభిప్రాయానికి తగ్గట్టు తగ్గి మంత్రిపదవులకే పరిమితం కావడం సంతోషకర పరిణామం తెలంగాణతో స్వేచ్ఛ వస్థుందని ఉద్యమపార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ చేసింది ప్రజలకు కనిపించకపోయినా బీఆర్ఎస్ గా పేరు మార్పు మాత్రం అచ్చిరాలేదు.
కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ అసెంబ్లీ ప్రారంభం నుంచే రేవంత్ ప్రభుత్వంపై విమర్శబాణాలు సంధించారు. అలాంటి ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు మేడిగడ్డ విషయంలో చేసిన తప్పును రాజకీయ అస్త్రంగా మార్చుకోకుండా ప్రజాసంక్షేమం కోరే ముఖ్యమంత్రిగా చర్చల ద్వారా పరిష్కరించడం నిజంగా కార్యసాధకుడి పని. అదే విజయాలబాట పట్టిస్తుంది. తెలంగాణలో మరిన్ని ప్రజామోద పనులు దేశం మొత్తం అనుకరించేలా మారాలని ఆశిద్దాం.
యం.వి.రామారావు,
8074129668