హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణం

జాతీయం

హాజరైన ప్రధాని మోడీ, అమిత్‌ షా, చంద్రబాబు
చంఢీగఢ్‌ : హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకుగానూ 48 చోట్ల బీజేపీ గెలుపొందింది. గవర్నర్‌ బండారు దత్తాత్రేయ.. నాయబ్‌ సింగ్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ , ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. సీఎంతోపాటు అనిల్‌ విజ్‌, క్రిషన్‌ లాల్‌ పన్వార్‌, రావ్‌ నర్బీర్‌ సింగ్‌, మహిపాల్‌ ధండా, విపుల్‌ గోయెల్‌, అరవింద్‌ కుమార్‌ శర్మ, శ్యామ్‌ సింగ్‌ రాణా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ సీఎం సహా 14 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియడంతో పంచ్‌కులాలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే విస్తృత సమావేశం జరిగింది. దీనికి పవన్‌ కల్యాణ్‌ హాజరు కానున్నారు. జమిలి ఎన్నికలు, జనగణన, ఉమ్మడి పౌర స్మృతి తదితర కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. బీజేపీకి, ఎన్డీయే పార్టీలకూ మధ్య సమన్వయానికి ఒక కమిటీ ఏర్పాటు చేయవచ్చని, ఇదే సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించవచ్చని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 48, కాంగ్రెస్‌ 37 సీట్లలో గెలుపొందాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ హరియాణాలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 90 స్థానాల్లో 67.9 శాతం పోలింగ్‌ నమోదైంది. గెలుపొందిన సీనియర్‌ నేతల్లో నయాబ్‌ సింగ్‌ సైనీతో పాటు, కాంగ్రెస్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హుడా, ఃఏఖ నేత అనిల్‌ విజ్‌ (అంబలా కాంట్‌), శ్రుతి చౌదరి (తోషమ్‌), ఎఔఒఆ అర్జున్‌ చౌతాలా తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *