హావెల్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా నయనతార, విఘ్నేష్‌

బిజినెస్

సృజనక్రాంతి/హైదరాబాద్‌ : సృజనాత్మకత, ప్రీమియం-క్వాలిటీ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన, దేశ ఎలక్ట్రికల్‌ పరిశ్రమలో అగ్రగామి అయిన హావెల్స్‌, ఐకానిక్‌ స్టార్‌ జంట నయనతార-విఘ్నేష్‌ శివన్‌ లను దక్షిణ భారత మార్కెట్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంచుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ ప్రాంతంలో హావెల్స్‌ పట్టును మరింత బలోపేతం చేస్తుంది, ఇక్కడ ఈ జంటకున్న ప్రజాదరణ వినియోగదారులలో లోతుగా ప్రతిధ్వనిస్తుంది. వారి డైనమిక్‌ భాగస్వామ్యం ఆధునిక గహాల కోసం సజనాత్మక, విశ్వసనీయ, స్టైలిష్‌ పరిష్కారాలను అందించడానికి హావెల్స్‌ ప్రయత్నానికి అద్దం పడుతుంది. నయనతార, విఘ్నేష్‌ శివన్‌ జంటగా నటించిన తొలి బ్రాండ్‌ ఇది. హావెల్స్‌ తో వారి భాగస్వామ్యం దక్షిణ భారత మార్కెట్‌లోని అపారమైన సామర్థ్యాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా హావెల్స్‌ ఇండియా సేల్స్‌ విభాగం ప్రెసిడెంట్‌ పరాగ్‌ భట్నాగర్‌ మాట్లాడుతూ, ‘‘శ్రేష్ఠతను అందించడంలో హావెల్స్‌ నిబద్ధత మా ప్రభావాన్ని పెంచే భాగస్వామ్యాలను అన్వేషించడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది. నయనతార- విఘ్నేష్‌ శివన్‌ ఆకర్షణ, సజనాత్మకత, విశ్వసనీయతల సమ్మేళనాన్ని వినియోగదారులతో కలుపుతారు. వారి అనుబంధం దక్షిణాదిలో మా ఉనికిని పెంచడమే కాకుండా, అభివద్ధికి కొత్త మార్గాలను అందిపుచ్చుకోవడానికి, దేశమంతా ప్రేక్షకులతో మా సంబంధాన్ని బలోపేతం చేయడానికి మాకు అనుమతిస్తుంది’’ అన్నారు.
హావెల్స్‌ ఇండియా ఈవీపీ బ్రాండ్‌ అండ్‌ మార్‌కామ్‌ రోహిత్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘‘నయనతార, విఘ్నేష్‌ శివన్‌ లను హావెల్స్‌ కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. దక్షిణ భారతదేశం మాకు వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. మన బ్రాండ్‌ విలువలను నిజంగా ప్రతిబింబించే వ్యక్తులతో కలిసి పనిచేయడం చాలా అవసరం. వారి ప్రభావం ఈ ప్రాంతంతో మా బంధాన్ని బలోపేతం చేయడానికి, దక్షిణ భారతదేశంలోని ప్రతి ఇంటికి ప్రపంచస్థాయి, విశ్వసనీయ ఉత్పత్తులను తీసుకురావడానికి మా నిబద్ధతను ప్రదర్శించడానికి మాకు సహాయపడుతుందని మేము నమ్ముతున్నాము’’ అని తెలిపారు.
ఈ అనుబంధంపై తమ ఆనందాన్ని వ్యక్తంచేస్తూ నయతార, విఘ్నేష్‌శివన్‌ ఇలా అన్నారు.. ‘‘హేవెల్స్‌ తో అనుబంధం చాలా సంతోషకరం. ఈ బ్రాండ్‌ సజనాత్మకత, నాణ్యత, నమ్మకాలకు పెట్టిందిపేరు. వీళ్ల ఉత్పత్తులు రోజువారీ జీవితంలో కలిసి ఆధునిక ఇళ్లకు సౌలభ్యం, శైలిని అందిస్తున్నాయి. శ్రేష్టత, సునిశితమైన హస్తకళా నైపుణ్యానికి విలువనిచ్చే వ్యక్తులుగా, కుటుంబాలను శక్తివంతం చేసే అత్యాధునిక పరిష్కారాలను అందించడానికి, దక్షిణాది మార్కెట్లలో బ్రాండ్‌ స్థానాన్ని బలోపేతం చేయడానికి మేము హావెల్స్‌కు పూర్తిగా మద్దతు ఇస్తాం. ఈ ప్రయాణంలో భాగం కావడానికి, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్‌ అవ్వడానికి మేము ఎదురుచూస్తున్నాము’’ అని చెప్పారు.
ప్రీమియం ఫ్యాన్లు, చిన్న గెపకరణాలు, లైటింగ్‌ సొల్యూషన్స్‌, స్విచ్‌ లు, వాటర్‌ హీటర్లు, ఐఓటి ఉత్పత్తులు, వైర్లు, వంట పరికరాలత సహా వీరి వైవిధ్యమైన ఉత్పత్తులను హైలైట్‌ చేస్తూ స్టార్‌ జంట హావెల్స్‌ ఉత్పత్తుల శ్రేణిని ప్రమోట్‌ చేస్తారు. కీలకమైన దక్షిణాది మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని టీవీ, ప్రింట్‌, డిజిటల్‌, అవుట్‌ డోర్‌, బీటీఎల్‌ ప్లాట్‌ ఫాంలలో త్వరలో కొత్త ప్రచారాన్ని ఆవిష్కరించనున్నారు.