ఇండియా కూటమికి పెరిగిన బలం
బలమైన ప్రతిపక్షంగా చేరకునే అవకాశం
దేశవ్యాప్తంగా ప్రజల తీర్పు
న్యూఢల్లీ : మోడీ మూడోమారు ప్రధాని కావడం ఖాయమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిరచాయి. మరోమారు బిజెపి కూటిమిదే అధికారమని తేల్చింది. దాదాపు అన్ని సంస్థలు నంబర్ అటుఇటుగా ఎన్‌డిఎకు మరోమారు ప్రజలు పట్టం కట్టారని వెల్లడిరచాయి. అదే సందర్భంలో కాంగ్రెస్ గతం కన్నా భారీగా సీట్లను సంపాదించుకుంది. ఇండియా కూటమి కూడా గణనీయంగా సీట్లు సంపాదించి గట్టి ప్రతిపక్షంగా రాబోతోందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇకపోతే ఈ దఫా 400 సీట్లు అన్న బిజెపి కలలు మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు. దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి శనివారం సాయంత్రి వివిధ సంస్థలు తమ సర్వేలను ప్రకటించాయి. వివిధ సర్వే సంస్థలు, విూడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసాయి. వివిధ సర్వేలు ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటన్నిటి ఆధారంగా దేశంలో ఎవరు అధికారంలోకి రానున్నారో అంచనా వేశాయి. ముచ్చటగా మూడో సారి కూడా ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని దాదాపు అన్ని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. ఎన్డీఏ కూటమి గరిష్టంగా 390 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. రిపబ్లిక్ ` పీమార్క్, ఇండియా న్యూస్ డీ వెల్లడిరచింది. డైనమిక్స్, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ చేసిన సర్వేలు 300 పైగా స్థానాలు కమలం పార్టీ గెలుస్తుందని చెబుతున్నాయి. సుదీర్ఘంగా ఏడు దశల్లో సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం తుది పోలింగ్ శనివారం ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మళ్లీ ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఊహిస్తున్నాయి. వరుసగా మూడోసారి మోదీ ప్రధాని పదవిని అధిరోహిస్తారని చెబుతున్నాయి. రిపబ్లిక్`పీ మార్క్, ఇండియా న్యూస్` డీ డైనమిక్స్, రిపబ్లిక్ భారత్ మొదలైన సర్వే సంస్థలు ఎన్డీయే కూటమి 350కి పైగా స్థానాలు సంపాదిస్తుందని ప్రకటించాయి.
రిపబ్లిక్ భారత్`పి మార్క్ అంచనా ప్రకారం ఎన్డీయే 359 సీట్లు, ఇండియా కూటమి 154, ఇతరులు 30 సీట్లు గెలుచుకుంటారు. రిపబ్లిక్`మాట్రైజ్ ప్రకారం.. ఎన్డీయే 353`368 సీట్లు, ఇండియా కూటమి 118, ఇతరులు 43`48 సీట్లు గెలుచు కుంటారు. ఇండియా న్యూస్`డి`డైనమిక్స్ అంచనా ప్రకారం.. ఎన్డీయే 371 సీట్లు, ఇండియా కూటమి 125 సీట్లు, ఇతరులు 47 సీట్లు గెలుచుకుంటారు. అలాగే జన్‌కీ బాత్ సర్వే కూడా ఎన్డీయేకే ఓటు వేసింది. ఆ సర్వే ప్రకారం.. ఎన్డీయే 362`392 సీట్లు, ఇండియా కూటమి 141`161 సీట్లు, ఇతరులు 10`20 సీట్లు గెలుచుకుంటారు. ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్ ప్రకారం ఎన్డీయే 365 సీట్లు, ఇండియా కూటమి 142 సీట్లు, ఇతరులు 36 సీట్లు గెలుచుకుంటారు. టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ 2024 ఫలితాలను విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సంచలన సర్వే విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన అంచనాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలకు ఎన్డీయే కూటమికి 12 స్థానాలు స్తాయని అంచానా వేసింది. అందులో తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు కైవసం చేసుకోగా.. జనసేనకు 1, బీజేపీకు 2 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్సీపీకి 13 స్థానాలు వస్తాయని తెలిపింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 8 సీట్లు సాధిస్తుందని తెలిపింది. అలాగే బిజెపికి 7, బీఆర్‌ఎస్ 1, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించనున్నట్లు తెలిపింది. ఆరా మస్తాన్ సర్వే ప్రకారం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 8 పార్లమెంట్ స్థానాలు వస్తాయన్నారు. ఇక బీజేపీకు 8 నుంచి 9 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుదని తెలిపింది. ఇతరులకు 1 స్థానం అని ప్రకటించింది. అందులో బీఆర్‌ఎస్, ఎంఐఎంలకు ఎవరికైనా రావొచ్చు అని చెబుతున్నారు. ఇదే ఆరా మస్తాన్ గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితమైన అంచనాలను వెలువరించారు.