ఫేమస్ కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్‌ఎం గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో గీతా ఆర్ట్స్ సంస్థ పోస్ట్ చేసింది. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. థియేటర్ ఆర్ట్స్ మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న నిహారిక, తన పదో తరగతిలో యూట్యూబ్ ఇన్ఫ్లయెన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. వివిధ అంశాలపై తన అభిప్రాయాలు తెలిపేలా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సబ్ స్క్రైబర్స్‌ను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్, కామెడీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. నిహారికకు సోషల్ మీడియాలో 6 మిలియన్ సబ్ స్క్రైబర్స్‌న్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా నిహారిక ఎన్‌ఎంకు మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకోవచ్చు.
