విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఆందోళన వద్దు

ఆంధ్రప్రదేశ్

ప్రధాని ఆశిస్సులతో వందశాతం వృద్ది సాధిస్తాం
దేశ ఆర్థికాభివృద్ధిలో స్టీల్‌ప్లాంట్‌ కీలక భూమిక
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి వెల్లడి
ప్రైవేటీకరణ జరగరాదన్నదే ప్రజల అభిమతమన్న ఎమ్మెల్యే
విశాఖపట్టణం : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన.. గురువారం స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్‌ మూతపడుతుందనే ఆందోళన వద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగు తుందని కుమారస్వామి తెలిపారు. అంతకుముందు విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను కేంద్రమంత్రి పరిశీలించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించడం తమ బాధ్యత అని, ప్లాంట్‌ మూతపడు తుందనే ఆందోళన వద్దని మంత్రి కుమారస్వామి అన్నారు. ఉక్కు ఉత్పత్తి సహా అన్ని విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల వివరాలను కేంద్ర మంత్రికి అధికారులు వివరించారు. ప్లాంట్‌ సందర్శన అనంతరం కుమార స్వామి విూడియాతో మాట్లాడారు. ’విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఉక్కు పరిశ్రమపై అనేక మంది ఆధారపడి ఉన్నారు. ప్రజలు, సిబ్బంది ఎలాంటి ఆందోళనలు చెందొద్దు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో పరిశ్రమలో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని కుమార స్వామి స్పష్టం చేశారు. ఇదిలావుంటే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటైజేషన్‌ అవ్వకూడదనే భావన అందరికీ ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసేందుకు స్టీల్‌ ఎª`లాంట్‌ అడ్మిన్‌ బ్లాక్‌కు ఎమ్మెల్యే వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ… స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగాలకు భద్రత కల్పించి ఎంతోమంది ప్రాణత్యోగాలు చేసి స్టీల్‌ ప్లాంట్‌ను తీసుకొచ్చారని గుర్తుచేశారు. విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్‌ అవ్వకుండా మంచి భవిష్యత్తు స్టీల్‌ ప్లాంట్‌కి ఉండేటట్టు చూడవలసిందిగా తాము కూడా కోరామని తెలిపారు. ఎలక్షన్‌ ముందు కూడా కోరడం జరిగిందన్నారు. ఎలక్షన్‌ తర్వాత బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు… కేంద్ర అధిష్టానానికి చెప్పామన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్‌, కేంద్రమంత్రి కుమారస్వామి ప్లాంట్‌ విజిట్‌ చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు అనేక రకాల ఆప్షన్స్‌ ఉన్నాయన్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే.. మన భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది అందరి అభిప్రాయం‘ అని విష్ణుకుమార్‌ రాజు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *