కాంచీపురం మంగళగౌరి షాపింగ్ మాల్ పిల్లర్ నం.81, పీర్జాదిగూడ, బోడుప్పల్లో తమ సరికొత్త షోరూము 2024 సెప్టెంబర్ 27వ తేదీనాడు శుభారంభం చేసింది. జంట నగరాలలోని సర్వోత్తమ షోరూముల్లో ఒకటైన మంగళగౌరి షాపింగ్ మాల్ కుటుంబంలోని అన్ని తరాలవారి అభిరుచులకు అనువుగా అద్భుతమైన షాపింగ్ అనుభూతిని ఒకేచోట సమగ్రంగా అందజేసే విధంగా రూపొందింది. ఇందులో అత్యంత విస్తారమైన శారీస్, మెన్స్వేర్, ఉమెన్స్వేర్, కిడ్స్వేర్ అందుబాటులో ఉన్నాయి.
షోరూము ప్రముఖ సినీతార కుమారి కృతిశెట్టి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృతిశెట్టి మాట్లాడుతూ “అద్భుతమైన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది” అంటూ ఇంత అందమైన, అన్ని బ్రాండులూ అందుబాటులో ఉండే అత్యంత సౌకర్యవంతమైన షోరూమ్న బోడుప్పల్లో నెలకొల్పినందుకు డైరెక్టర్లను అభినందించారు. ఈ సందర్భంలో కృతిశెట్టి మంగళగౌరి షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవ మరియు దసరా-దీపావళి ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులను కోరారు. ఈ ఆఫర్ అన్ని రకాల వస్త్రాలపై అందుబాటులో ఉండటం విశేషం.
తమ బ్రాండ్కు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికల గురించి మంగళగౌరి షాపింగ్ మాల్ సంస్థ డైరెక్టర్ శ్రీ కృష్ణమూర్తి మీడియా వారికి వివరిస్తూ- వెడ్డింగ్ కలెక్షన్స్లో పోటీ ధరలకు నాణ్యమైన వస్త్రశ్రేణిని అందజేయడం తమ లక్ష్యమని చెప్పారు. తమ షోరూమ్ లో అన్ని తరాల కుటుంబసభ్యుల అభిరుచులకు సరిపడే 4 లక్షల వెరైటీలు లభిస్తున్నాయనీ, ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు, ప్రత్యేకమైన వేడుకలకు మంగళగౌరి షాపింగ్ మాల్ ఎంతో సౌకర్యంగా ఉంటుంద’ని కృష్ణమూర్తి అన్నారు.
తమ శారీ కలెక్షన్స్లో అనేక రకాల పట్టుచీరలు ప్రత్యేకంగా ఉన్నాయని; వీటిలో కంచిపట్టు, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి, మహేశ్వరి, కోయంబత్తూరు, కోల్కతా, బెనారస్, ఇంకా హైఫ్యాన్సీ శారీ వెరైటీలు, ప్యూర్ అర్ధంజా, ప్యూర్ ఖాదీ జార్జెట్, ఫ్లోరల్ ప్రింట్స్, బిన్నీ క్రేప్ సిల్క్ వంటి అనేక రకాలు లభిస్తున్నాయని, అదేవిధంగా విస్తృతమైన రకాలకు చెందిన మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఎత్నిక్వేర్ తమ వద్ద అందుబాటులో ఉన్నాయని కృష్ణమూర్తి మీడియా వారికి తెలియజేశారు. రానున్న పండగలు వివాహాది శుభకార్యాల సీజన్లకు బోడుప్పల్ వాసులు తమ మంగళగౌరి షాపింగ్ మాల్ కి విచ్చేసి అద్భుతమైన ఆఫర్లతో పాటు సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలను కొనుగోలు చేయగలరని ఆకాంక్షించారు.
