చలామణీలోనే రూ.10నాణేలు

బిజినెస్

అపోహలు తొలంగించేందుకు విస్తృతంగా
‘పబ్లిక్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్’
ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ రాజేష్‌కుమార్‌ వెల్లడి
సృజనక్రాంతి/హైదరాబాద్‌ : ప్రజలలో రూ.10 నాణేలు చలామణీలో లేవనే అపోహలను తొలం గించేందుకు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా ‘పబ్లిక్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రావ్స్‌ు’ (పిఎసి) నిర్వహిస్తు న్నామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ రాజేష్‌కుమార్‌ తెలిపారు. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహ కారం, ఎస్‌బిఐ సమన్వయంతో రూ.10నాణేల చలామణీ అంగీకార పబ్లిక్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్లను గురువారం (అక్టోబర్‌ 3), శుక్రవారం (అక్టోబర్‌ 4) నిర్వహించామని ఆయన తెలిపారు. రూ.10 నాణేలుపై అపోహలు ఎక్కువగా వ్యాపారస్తులలో నెలకొన్నాయని, దాంతో ప్రజలు కూడా అదే అపోహలలో ఉన్నారని తెలియజేశారు. రూ.10నాణేలు చెల్లవని చెప్పడం రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడమే అవుతుందని, ఈ ధోరణి సరికాదని రాజేష్‌కుమార్‌ వివరించారు. కొన్ని శక్తులు ఈ అనుమానాలు, అపోహలను రాష్ట్రాలలో వ్యాప్తింపచేస్తున్నాయని చెప్పారు. ఈ రెండు రోజులలో ఎస్‌బిఐ రిటైల్‌ కస్టమర్లలో అవగాహన పెంపొందించిందని రాజేష్‌కుమార్‌ వెల్లడిరచారు. ప్రధానమంత్రి సన్విధి లబ్ధిదారులు, చిన్నవ్యాపారస్తులు, కిరాణ స్టోర్ల యజమానులలో అవగాహన కల్పించేలా కరపత్రాలను కూడా పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరం కోఠిలోని ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద రూ.10నాణేలను తీసుకోవడం, పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాజేష్‌కుమార్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లోని అన్ని ఎస్‌బిఐ బ్రాంచ్‌లు కూడా ఈ ప్రజా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాయని తెలిపారు.