సృజన క్రాంతి, సూర్యాపేట జిల్లా ప్రతినిధి: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, మహిళల విద్యాభివృద్ధికి పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల్ల నర్సింహ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి, గొప్ప సామాజికవేత్త అని గుర్తు చేశారు. స్త్రీ విద్యావంతురాలు అయితే తన సంతానానికి విద్యను అందించడం ద్వారా కుటుంబం విజ్ఞానవంతుతే గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే స్త్రీ విద్యకు పునాదులు వేశారని అన్నారు. 150 సంవత్సరాలు క్రితం స్వాతంత్రం లేని రోజుల్లో బ్రిటిష్ పాలనలో వాక్ స్వాతంత్రం లేని రోజుల్లో అగ్రవర్ణాల అధిపత్యంలో బలహీన వర్గాలకు చెందిన పురుషులనే చదువుకు దూరంగా ఉంచిన పరిస్థితులలో సొంతంగా బడుగు బలహీన వర్గాల బాలికలకు స్వంతంగా పాఠశాలను, వసతి గృహాలను నెలకొల్పి సావిత్రిబాయి ఫూలే విద్యను అందించారని అన్నారు. సమాజంలో ఉన్న అనేక రకాల సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలు, అంటరానితనాన్ని, బాల్య వివాహాలను, సతీసహగమనాన్ని, భర్త చనిపోతే స్త్రీలకు శిరోమండలం చేయడాన్ని, వ్యతిరేకించి వాటిని రూపుమాపడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమైంది అన్నారు. నేటి సమాజం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. సూర్యాపేటలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలకు సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణ గౌడ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హసేన్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, బీసీ నాయకులు పిషిక వీరయ్య, కందాల భాస్కర్, పేరూరి రమణ, బైరు విజయకృష్ణ, మట్ట రమేష్ యాదవ్, దాసరి వెంకన్న యాదవ్, యలగందుల సుదర్శన్, తన్నీరు వాసుదేవ్, జంపాల వెంకటేశ్వర్లు, మంతాపురం వెంకటేశ్వర్లు, పున్న వెంకన్న నేత, చలమల్ల యశ్వంత్ కుమార్, కేతం వెంకటేశ్వర్లు, పగిళ్ల వెంకన్న, తండు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పేరుతో తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన ప్రముఖ న్యాయవాదులు తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లే యాదవ్, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హసేన్ లు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మట్టిపల్లి మల్లేష్ యాదవ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనదేశంలో పుట్టిన గొప్ప సామాజిక సంఘసంస్కర్తలు మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రి భాయి పూలే ఇద్దరు మనదేశంలో అనాదిగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా అణచివేతలకు గురి అయిన ఎస్సీ ఎస్టీ, బీసీ మహిళల విముక్తి కోసం వారు చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రగతి భవనం పేరు మహాత్మా జ్యోతిబా పూలే భవనం నామకరణం చేయటం హర్షనీయమని అన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని అధికార పూర్వకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కంచుకొమ్ముల వెంకట్ , బీసీ మహిళా సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షరాలు సారగండ్ల వెంకటమ్మ, కాస అనసూయ, ఏడిండ్ల అశోక్, కోడి లింగయ్య యాదవ్, మన్నే హరి ప్రసాద్, నామా వేణు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.