సమకాలీన కవిత్వానికి సాధికారిక దిక్సూచి ‘చెమట చెక్కిన వాక్యం’

కవిత్వ నిర్వచనం, దాని నిర్మాణం పట్ల ప్రాచీన లాక్షణికుల నుండి ఆధునిక కవుల వరకు కొత్త కొత్త వ్యూహాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. వస్తువుకి అనుగుణమైన రూపాన్నీ, శిల్పాన్నీ ఎన్నుకోవడంలోనే కవి ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొంతమంది మంచి వస్తువుని తీసుకున్నా, దాన్ని తగిన శిల్పంలో అభివ్యక్తీకరించలేరు. అలాగే, శిల్పం తెలిసినా వస్తువుని దానికి అనుగుణంగా వాడుకోవడం కూడా తెలియని వాళ్ళున్నారు. శిల్పం కోసమో, ప్రయోగం కోసమో రాసే కవులు వస్తువుని నిర్లక్ష్యం చేస్తారు. వీటిని వచన కవిత్వం […]

More

కవులు రచయితలు తమ రచనల్లో సమకాలీన జీవితం ప్రతిబింబించే విధంగా వ్రాయాలి

పండిత వంశంలో జన్మించి, నెల్లూరు సర్వోదయా కళాశాల అంధ్రోపన్యాసకునిగా, ప్రిన్సిపాల్‌గ పనిచేసి, అనేక గ్రంథాల సంపాదకత్వం వహించి, ఇప్పటికీ సాహిత్యంలో చురుకుగా ఉన్న కాళిదాసు పురుషోత్తంతో ఈ వారం ముఖా ముఖి. మీ బాల్యం విద్యాభ్యాసం వివరాలు క్లుప్తంగా చెప్పండి? మా పూర్వీకులది ప్రకాశం జిల్లాలోని తూమాడు గ్రామం. తాత ముత్తాతల కాలం నుండి మాది పండిత కుటుంబం. మా తండ్రి ‘‘విద్యావాచస్పతి’’ కాళిదాసు వేంకట సుబ్బశాస్త్రి. వ్యాకరణం, సంస్కత సాహిత్యంలో మహాపండితులు. నేను మొదట ఇంట్లో […]

More