సుకవితా పరిమళాల పలకరింత ‘అనల్పం ‘

మనిషి తనతో తాను అంతర్యుద్ధం చేస్తూనే సమాజంలో పాతుకపోయిన వ్యవస్థలతో కూడా నిర్విరామంగా యుద్ధం చేస్తుంటాడు. సమాజంలో జరుగుతున్న అమానవీయమైన సంఘటనలు అతన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇతరుల అభిప్రాయాలతో కవికి ఒక పట్టాన సమన్వయం కుదరకపోయినా, ఒక నిరంతరాన్వేషిలా, ఋషిలా, జ్ఞానపిపాసిలా దర్శనమవుతుంటాడు. కవి చేసే ప్రతిపాదనలతో మనం అంగీకరించినా అంగీకరించకపోయినా తాననుకున్న దారిని మాత్రమెప్పుడూ వదలడు. _______ అత్యాధునిక తెలుగు సాహిత్యంలో రాగద్వేషాలకు అతీతంగా, అచ్చమైన మానవీయ కోణంలో కవిత్వం రాస్తున్న అతికొద్దిమంది తెలుగు కవుల్లో […]

More

ఆశలను చిగురించే సరికొత్త పదాల పలకరింపుల ‘సామభేద’

కాలంతో పాటు మానవ సమాజంలో వస్తున్న గణనీయమైన మార్పులు వర్తమాన కవుల అభివ్యక్తుల్లో చోటు చేసుకుంటాయి. సంక్లిష్టమైన జీవనయానంలోని అమానవీయమైన కోణాలను, జీవన్మరణ పోరాటాలను, సాహిత్యంలో వినూత్నంగా వెల్లడించడానికి సృజనకారులు ప్రయత్నిస్తుంటారు. కళ్ళ ముందు దృశ్యమానమవుతున్న విభిన్న సంఘటనల పూర్వాపరాల నేపథ్యాల నుండి రాయాలనే తపన వారిని నిలువనీయదు. ఆశలను చిగురించే సరికొత్త పదాల పలకరింపుల కవితా పాదాలు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. సున్నితమైన భావాలను, సమరశీలమైన దృక్పథాన్ని, ఒక కన్నతల్లి ప్రేమను, గతి తప్పిన జీవితాలకి […]

More