ఒక రైతు ప్రేమికుడి కవితాగానం ‘మట్టి మట్టి’

“ఎన్నాళ్లు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం” “నేలను రైతన్న దున్నినంత కాలం మెతుకు మీద మనిషి బతికినంత కాలం” తెలుగు కవిత్వంతో పరిచయమున్నవారికి ఈ కవిత్వ పాదాలు నినాదాలుగా గుర్తుండి పోయాయి. కవిత్వంలో కొత్త ప్రయోగాలు చేస్తున్న ప్రగతిశీల కవి దర్భశయనం శ్రీనివాసాచార్య. నిర్విరామంగా కవిత్వంతో కరచాలనం చేస్తూ మనందరినీ పలకరిస్తుంటారు. కళ్ళ ముందు జరిగే ప్రతి అన్యాయాన్ని, అధర్మాన్ని ప్రశ్నించకుండా ఉండలేరు. కాలానికి నిలబడిన కవిత్వాన్ని రాస్తున్న అతి కొద్దిమంది ఆధునిక తెలుగు కవుల్లో ఆయన […]

More

పుస్తకప్రేమికుడు రామడుగు రాధాకృష్ణమూర్తి

అరవై దశకంలో ఎక్కడ ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా బక్క పలుచని అర్భకంగా కనిపించే వ్యక్తి భుజానికో సంచి తగిలించుకుని వచ్చి సభా మందిరంలో వెనక సీట్లలో కూర్చునేవారు. అయినా కూడా సభకి వచ్చిన రచయితలందరూ అతనిని పలకరించేవారు.ఆయనే రామడుగు రాధాకృష్ణమూర్తి అని పిలువబడే సాహిత్య ప్రేమికుడు.ఆయన సంచిలో ఎవరి అవసరం కోసమో ఎప్పుడూ పుస్తకాలు ఉంటాయి. రామడుగు గారికి పరిచయమో,స్నేహమో లేని తెలుగు రచయితలు బహుశా ఉండకపోవచ్చు. ఆయనకు తెలిసిన రచయితలనూ,స్నేహితులైన కథకులనూ,చదివిన పుస్తకాలనూ,నచ్చిన కథలనూ […]

More