ముకుంద రామారావు కవిత్వ తత్త్వమంతా అభివ్యక్తి సత్వమే!
ముకుంద రామారావుగారు నిరంతర అధ్యయనశీలి. సమాజ పరిశీలనలో, సాహిత్య పరిశోధనలో నిర్విరామ కృషీవలుడు. అనువాద రచనల గురించి తలచుకోగానే ముందుగా స్ఫురించే పేరు ముకుంద రామారావు గారిదే. ఆ రంగంలో వారిది అపూర్వమైన విజయం. ‘అదే ఆకాశం’, ‘అదే గాలి’, ‘అదే నేల’, ‘అదే కాంతి’, ‘అదే నీరు’ పేర్లతో వారు వెలువరించిన దేశదేశాల కవిత అనువాదాలు అనన్య ప్రాచుర్యాన్నీ, ప్రసిద్ధినీ వహించాయి. అవన్నీ వందల పేజీల ఉద్గ్రంథాలు. ఇలా 16 అనువాద గ్రంథాలు కాక, స్వీయకవిత్వం […]
More