కాలదోషం పట్టని వస్తుస్పృహే శివకుమార్ కథల బలం

సాహిత్య జీవన షష్టిపూర్తిని జరుపుకున్న శ్రీ పి.వి.ఆర్. శివకుమార్ తెలుగు పత్రికాలోకంలో బహుళ ప్రాచుర్యాన్నీ, అత్యధిక పాఠకాదరణనూ పొందిన ప్రముఖ కథకులు, నవలాకారులు. 72-82 మధ్య, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అనేక నాటికలు, కథలు, పూలజల్లు వంటి కార్యక్రమాలు, ఈనాడు దినపత్రికలో టూకీగా శీర్షిక, ఆదివారం అనుబంధంలో వ్యాసాలు, మినీ కథలు, సితార వ్యాసాలతో పాటు, సినిమా సమీక్షలు విరివిగా వచ్చాయి. విపులలో యాభై దాకా వివిధ భాషల అనువాద కథలు వచ్చాయి. అలనాటి ఆంధ్రపత్రిక మొదలుకొని, […]

More