బతుకు అర్థాన్ని తెలియజేస్తున్న డా॥ భవానీదేవి కథలు

డా. చిల్లర భవానీదేవి. ఈనాటి పాఠకలోకానికి సుపరిచితమైన పేరు. 16 కవితాసంపుటాలు, 4 కథాసంపుటాలు, 4 నవలలు, 7 బాలసాహిత్యం పుస్తకాలు, 2 నియోలిటరేచర్, 9 అనువాదాలు, 3 వ్యాససంపుటాలు, 11 ఇతర రచనలు- వెరసి 56 పుస్తకాలు. ఆమె సాహిత్య వరివస్య ఇంకా విస్తృతమైనది. టీవి సీరియల్స్ కు రాశారు. క్యాసెట్లు ఇచ్చారు. ఇలా బహుముఖీన ప్రజ్ఞాప్రాభవం కలిగిన భవానీదేవిగారు – ఆంధ్రాంగ్ల హిందీ భాషల్లో పండితురాలు. స్నాతకోత్తర పట్టభద్రులు. న్యాయ శాస్త్రంలోనూ డిగ్రీ వున్నది. […]

More

శివారెడ్డి కవిత్వం శిల్పభూమిక

శిల్పం అనేపదం సంస్కృతంలోని శిలధాతువునుంచి ఏర్పడింది.శీలం అనే పదానికి స్వభావం అని అర్థం.కవిత్వ ముఖంగా కవిత్వం చెబుతున్న సంవిధానం యొక్క స్వభావమే శిల్పం. ఇది కవితా రూపం,వాక్య రూపం, భాషా రూపం, రూపకాత్మక భాష. ఇవన్నీ ఒక కవి రచనకు గల శిల్పాన్ని పరిపుష్టం చేస్తాయి.వస్తువుయొక్క సమగ్రభావనే శిల్పం.వస్తువును నిర్వహించడానికి ఎంత సమగ్రంగా వస్తుసంబంధ అంశాలను ప్రోదిచేస్తున్నాడు, వాటన్నిటి మధ్య ఏక సూత్రత ఎలా కవిత్వంలో ఉంది, వీటన్నిటితో పాటు వస్తువుపట్ల తానేమి అనుభవించాడో.. ఆభావనను, అనుభవాన్ని […]

More

శ్వాస అక్షరాలుగా నడిచిన కవితా సంపుటి ‘స్వీయచిత్రం’

కవి రాసిన కవితల్లో ఒక నదీ ప్రవాహాన్ని పాఠకుడు దర్శించటం, ఆ కవి ప్రతిభా పాటవాలను, ఒక పాట తన స్వరాల రూపంలో అందించినట్లుగా వుంటుంది. ఆకులను, పూలను విస్తారంగా రాల్చే ఒక వృక్షంలా ప్రతి కవిత, పాఠకులను పలకరించినప్పుడు, ఆ అనుభూతికి ఆనకట్టలు కూడా కదిలిపోతాయి. మంచి సాహిత్యాన్ని చదివిన ఒక సంతృప్తి పాఠకుడి మనసును ఆనందాల పల్లకీలలో ఊరేగించినప్పుడు, ఆ కవిత్వాన్ని రాసిన కవి నామధేయం, నుదుటి కస్తూరి తిలకంలా మెరుస్తూనే వుంటుంది. ఆ […]

More

నేలమీద నిలబడే కవిత్వం

సాహిత్యం పట్ల అభిరుచితోపాటు సృజనాత్మకతనూ అలవరుచుకున్న సున్నిత మనస్కుడు అవధానుల మణిబాబు. విశ్లేషణ నుంచి విమర్శనాత్మకంగా ఆలోచించేటందుకు బహుగ్రంథ పఠనం అవసరం. అలా చదవడంతో పాటు తులనాత్మక పరిశీలన కూడా మణిబాబు సొంతం చేసుకున్నారు. పిన్నవయసు నుండే ప్రసిద్ధ రచయితల సామీప్యంలో, సాన్నిహిత్యంలో తనను తాను మలచుకున్నారు. చదువరి సృజనాత్మకతను పరిరక్షించేది స్పందించే హృదయమే అనడంలో అతిశయోక్తి లేదు కదా! అలా మణిబాబు తనతో తాను, తనలో తాను నిరంతరం సంభాషించే సంపూర్ణ సాహిత్య పిపాసి. సముద్రంతో […]

More