ఆధునికానంతర అనుభూతి కవిత్వం ‘అనుమంద్రం’
‘అనుమంద్రం’ కవితా సంపుటిని చదివిన తరువాత నాలుగు మాటలు రాయాలనుకోవటం.. ఎలా రాయాలో, అసలు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని కృత్యాద్యవస్థ. ‘అనుమంద్రం’ అనే పదం చూడగానే నాకున్న చిరు సంగీత పరిజ్ఞానానికి మంద్ర, మధ్యమ, తారాస్థాయిలు సంగీతంలో మూడు స్థాయిలుగా ఉంటాయని మాత్రమే తెలుసు. మంద్ర స్థాయి అంటేనే లోగొంతుక. అనుమంద్రం అంటే ఇంకా కిందిస్థాయి. సంగీతంలో అనుమంద్రం, మంద్రం, మధ్యమ, తార, అతి తారా స్థాయులనే పంచస్థాయుల ప్రస్తావన కూడా ఉంది. మంద్రానికి హృదయ […]
More