భావోద్వేగాల ఇంద్రధనువులు

ఊహకు రంగుంటుందా? ఊహది గోధుమ రంగా? ఎందుకు ఎలా? జేమ్స్ జాయిస్ డబ్లినర్స్ పాత్రల అంతస్సంఘర్షణకు వేదికగా పరుచుకున్న డబ్లిన్ వీధుల, భవనాల రంగు గోధుమ. విలియం ఫాల్క్నర్ సవుండ్ అండ్ ఫ్యూరీలో కాంప్సన్ కుటుంబం నలుగుతున్న విలువల పతనం ప్రతిబింబమై కనపడే వర్ణం గోధుమ. విలియం వర్డ్స్ వర్త్ కవిత ‘టింటర్న్ ఎబే’ లో పదబంధాలైన పురాస్మృతుల రంగు గోధుమ. టోనీ మోరిసన్ ‘బిలవుడ్’ లో సేథే తన బానిస బతుకును లోకంతో ముడిపెట్టుకునేది గోధుమ […]

More