కలానికి, కుంచెకు సమాన ప్రాధాన్యతనిచ్చిన శీలావీ
కొందరి పరిచయాలు వారి గొప్పతనం,వారితో ముడిపడివున్న జ్ఞాపకాలు- వారు జీవించి వున్నా, మనల్ని విడిచి, కనిపించని దూరాలకు వెళ్ళిపోయినా, జీవితాంతం అవి మన చుట్టూనే తిరుగుతుంటాయి. గతాన్ని సింహావలోకనం చేసుకునేలా చేస్తాయి. దానికి వారి వ్యక్తిత్వమూ, మంచితనమూ,స్నేహగుణం వంటి అంశాలు కారణం అవుతాయి. నా జీవితంలో నాకు అలాంటి వ్యక్తి తారసపడడం నా అదృష్టంగా భావిస్తాను. ________ నవల,కథ, వ్యాస రచయిత, కవి, చిత్రకారుడు, సహృదయ మూర్తి ’శీలావీ’ గా ప్రసిద్ధులైన శ్రీ శీలా వీర్రాజు గారు.. […]
More