శివారెడ్డి కవిత్వం శిల్పభూమిక

శిల్పం అనేపదం సంస్కృతంలోని శిలధాతువునుంచి ఏర్పడింది.శీలం అనే పదానికి స్వభావం అని అర్థం.కవిత్వ ముఖంగా కవిత్వం చెబుతున్న సంవిధానం యొక్క స్వభావమే శిల్పం. ఇది కవితా రూపం,వాక్య రూపం, భాషా రూపం, రూపకాత్మక భాష. ఇవన్నీ ఒక కవి రచనకు గల శిల్పాన్ని పరిపుష్టం చేస్తాయి.వస్తువుయొక్క సమగ్రభావనే శిల్పం.వస్తువును నిర్వహించడానికి ఎంత సమగ్రంగా వస్తుసంబంధ అంశాలను ప్రోదిచేస్తున్నాడు, వాటన్నిటి మధ్య ఏక సూత్రత ఎలా కవిత్వంలో ఉంది, వీటన్నిటితో పాటు వస్తువుపట్ల తానేమి అనుభవించాడో.. ఆభావనను, అనుభవాన్ని […]

More