ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని గుర్తు తెచ్చే కథలు

మహిళా ఇంజినీర్లు అరుదుగా కనిపించిన కాలంలో, ఏకంగా రహదారులు-భవనాల శాఖలో ఇంజినీరుగా పని చేసి, తన ఆధ్వర్యంలో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు వేయించారు పసుమర్తి పద్మజ వాణి. అక్కడితో ఊరుకుంటే ఈమెని గురించి ఎక్కువమందికి తెలియకపోను. ఆ రోడ్డు నిర్మాణ అనుభవాలకి ఇతరత్రా ఆలోచనల్ని జతచేసి కవిత్వంగానూ, కథలుగానూ మలిచారు. ఎప్ప్పుడో 1981 లో మొదలు పెట్టి 2011 వరకూ అప్పుడొకటి ఇప్పుడొకటిగా రాస్తూ వచ్చిన తొమ్మిది కథలని కలిపి మొన్నీమధ్యనే ‘బతుకు రాదారిలో..’ పేరిట కథాసంపుటి […]

More

ఈస్తటిక్స్ ఉత్తమ కథలు 2025: జీవితపు కొత్త పార్శ్వాలు

వాళ్లిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరి శ్రమా ఒకటే. ఒకరు నడుముకు వంకతాడు కట్టుకుని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తారు. మరొకరు నడుముకు చేంతాడు కట్టుకుని లోయల్లో ఎక్కడో బండ గుట్టలకు వేలాడే తేనెపట్టునుండి తేనె తీస్తారు. కల్లు మైకాన్ని కలిగిస్తుంది. తేనె మనిషికి బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. సామాజిక చట్రంలో ఇద్దరూ కింది తరగతి వాళ్ళే! కానీ తాటికల్లు తీసిన వాడికి వుండే సామాజిక గుర్తింపు తేనెకల్లు తీసేవాడికి ఉండదు? ఎందుకని? ఇదే సందేహం వచ్చింది తేనెకల్లులో ఈసప్పకి. […]

More

తెలంగాణ పల్లె జీవితాలకు అద్దం పట్టే ‘బర్కతి’ కథలు

ఆధునిక జీవనశైలి, మారుతున్న కాలంతో పోటీపడి, గ్రామీణ ప్రజల జీవన మాధుర్యానికి దూరం అవుతోంది. ఈ మార్పునకు ఎవరూ అతీతులు కారన్నది అంగీకరించదగిన సత్యం. తెలంగాణ నేపథ్యం అంటేనే దానిదైన ప్రత్యేక యాస, భాష, ఆట-పాటలు, ఒగ్గు కథలు, జానపద గేయాలు, సంస్కృతి మరియు జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇది గ్రామీణ జీవనానికి నిజమైన ప్రతిబింబంగా నిలుస్తుంది. తెలంగాణ సాహిత్యం వివిధ రూపాలలో మనుషులలో మానవీయతను పెంపొందించడంలోనూ, సమాజ మార్పుకు దోహదం చేయడంలోనూ ప్రముఖ […]

More

మూసకు మూత- ‘కొత్త తలుపు’ కథలు

కాళ్ళకూరి శైలజ వైద్యురాలిగా అటు మనుషులకు చికిత్స అందిస్తూ, ఇటు తన సృజనాత్మక కథల ద్వారా కథా సేద్యం చేస్తూ, సమాజానికి మానసిక చికిత్స అవసరమైన చోట చేస్తూ, స్వస్థత చేకూరుస్తూ రాసిన 15 కథల సంపుటి “కొత్త తలుపు”. పేరుకు తగ్గట్టుగా కథలన్నీ కథా సాహిత్యంలో కొత్త తలుపులు తెరుస్తున్నాయి. ప్రత్యేకమైన శైలిలో జెండర్ లిమిటేషన్స్ అధిగమించి కొన్ని కథల్లో పొయెటిక్ ప్రోజ్ వాక్యాలతో విభిన్న తరహా ఇతివృత్తాలు, పాత్రలు, వ్యక్తిత్వ వైవిధ్య వైరుధ్యాలను కథనం […]

More

మట్టి గుండె సవ్వడితో సంభాషించిన కథలు

కథ, కవిత, విమర్శ రంగాల్లో తనకుతానే సాటిగా చాలా బలంగా వినిపించే పేరు డా.పాపినేని శివశంకర్. తెలుగు కథానికల్లో సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ, వాస్తవికత పునాదిగా, గాఢతను, క్లుప్తతను, సాహితీ సౌందర్యాన్ని ప్రధాన లక్షణాలుగా ఎన్నుకుని పాఠకునితో జీవద్భాషతో సంభాషించగలిగిన కథలను అందించిన కళాసూత్ర జ్ఞానిగా వీరు ప్రసిద్ధులు. _________________ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు “డా. పాపినేని శివసంకర్ కథలు” శీర్షికతో కథా సంపుటిని విడుదల చేశారు. ఈ సంపుటిలోని పది కథలు, […]

More

ఒడిశా వనవాస జీవిత వైశిష్ట్యానికి కథలతో హారతి

డా.మహేంద్రకుమార్ మిశ్రా ప్రముఖ ఒడియా రచయిత మరియు జానపద పరిశోధకులు. ఒడిశాలో తూర్పు, ఉత్తర ప్రాంతాలలో పచ్చని భూములనిండా విస్తరించిన వందలాది పండ్ల వృక్షాల నీడన, దక్షిణ, పశ్చిమ దిక్కులలో ఆకాశాన్ని అందుకునే పర్వత శ్రేణులు, పచ్చదనాన్ని విస్తారపు పంటల్లా పండించే అరణ్యాలలో సేద తీర్చుకున్న జనజీవన స్రవంతిలోని స్వరాలను శృతిచేసుకున్న జానపద కథల గుండె సవ్వడిని సుదీర్ఘకాలంగా నమోదు చేసుకుంటూ, నాణ్యమైన కథా సాహిత్య భాండాగారాన్ని విశ్వానికి కానుకగా అందించిన సుప్రసిద్ధ నిత్య సాహిత్య హాలికుడు […]

More

తెరకెక్కని చీకటి జీవితాల ‘కృష్ణానగర్ ‘ కథలు

చదువు కోసమో, ఉద్యోగం కోసమో ఏదో ఒక పని మీద నగరంలో బతకడం అనేది నేడు అనివార్యత అయ్యింది.చాలామంది అనుకుంటున్నట్టు నగరం విషనాగు కాదు. నగరానికి.. పిలిచి అన్నం పెట్టడం తెలుసు. పని చూపించడం తెలుసు. సినిమా ఆర్టిస్టుల కన్నీటి జీవితాలకు అద్దం పట్టే హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో నివసించే జీవితాల గురించి రావెళ్ళ రవీంద్ర రాసిన ‘కృష్ణానగర్ వీధుల్లో’ కథలు నగరం ఆత్మను కళ్ళకు కట్టి చూపే కథలు. ఆధునిక జీవిత సంక్షోభాలను, ప్రేమరాహిత్యపు […]

More

కాల పరిణామంలో సమాజాన్నీ, మనిషినీ చిత్రించిన కథలు ‘పోడుగాలి’

ఈతకోట సుబ్బారావుగారు అంటే ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదకులు. ఇదొక బ్రాండ్ నేమ్. తెలుగు సాహితీలోకానికి కవిగా, కథకులుగా కూడా సుపరిచితులు. 8 కవితా సంపుటాలు, ఒక కథా సంపుటి కాక, 7 స్థానిక చరిత్ర రచనలతో పాఠకలోకాన్ని అలరించినవారు. అవిగాక, 5 గ్రంథాల సంపాదకత్వం వారి విస్తృత సాహితీకృషికి దర్పణంగా నిలుస్తోంది. తొలి కథాసంపుటి ‘కాశీబుగ్గ’ వెలువడిన 11 ఏళ్ల తర్వాత వచ్చింది ఈ ‘పోడుగాలి’ సంపుటి. _____ ఒక రచయిత రాసిన కథల్లోని వస్తువైవిధ్యాన్ని […]

More

రాయలసీమ మట్టివాసనతో పలకరించే కథలు- “మట్టిమొగ్గలు”

కథలు మట్టిలోనుంచి పుట్టినప్పుడు, ఆ పరిమళం విశ్వవ్యాప్తమవుతుంది. అందులో అక్షరాలు వుండవు. అన్నీ అనుభవాలే. వాక్యాలు చదువుతూ వుంటే, ఎవరో చేయిపట్టుకుని అప్పటి చరిత్ర రహదారుల మీద నడిపించినట్లుగా వుంటుంది. ఆ స్పర్శనిండా కథకుడి గుండెలోని శబ్దాలు కథలోని, పాత్రలై పలకరిస్తూ వుంటాయి. పరవశించిపోతున్న పాఠకుడి పాదముద్రలు ప్రతి కథ గడపముందు, తన గుర్తుల్ని వ్రేలాడదీసుకుంటూ వెళ్తూవుంటాయి. ఈ కథల్ని పాఠకుడు చదివినప్పుడు, అతడి మనసు తాళపత్రాలమీద చెదరిపోని ఓ అద్భుతమైన అనుభూతి ఒక కావ్యంలా శాశ్వతం […]

More

సమతా నినాదం – “సాక” కథలు

మహారాష్ట్ర దళిత పాంథర్స్ ప్రభావం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో 1980వ దశకంలో ప్రారంభమయిన దళితోద్యమము క్రమక్రమంగా కవిత్వమై కష్టాలనీ, కన్నీళ్ళనీ వ్యక్తీకరించి అస్తిత్వగానమై నేటివరకు గొంతు విప్పుతూనే వుంది. ఈ చైతన్యం ద్వారా వచ్చిన పాటలు సమాజాన్ని ప్రభావితం చేశాయి. సామాజిక లక్ష్యం కోసం దళిత కవులు బాధ్యతతో నిలబడ్డారు. ప్రజల్లో చైతన్యం నింపారు. దళిత కవుల సంపాదకత్వంలో సామాన్యులే కథానాయకులుగా కవిత్వం, వివిధ సంకలనాలుగా ధిక్కారమై ఎగసి పడుతున్నందున ‘ఇపుడు నడుస్తున్నది చండాల చరిత్ర’ […]

More