వైవిధ్య భరితం డా. కె.ఎల్వీ ప్రసాద్ కథల సమాహారం

జీవితానికి ప్రతిబింబం సాహిత్యం – అది ఏ ప్రక్రియలోనైనా కానీ. కథ, కథానిక, గల్పిక పరిధికి ఉన్న పరిమితుల దృష్ట్యా ఒక సంఘటన, ఒక సన్నివేశం, ఒక దృశ్యంని చిత్రించినా పాఠకుడికి ఒక అద్భుతం ఆవిష్కరణ కలగవచ్చు. ముగింపులో పరిష్కారం చెప్పటం ప్రతి కథలోనూ ఉండక పోవచ్చు. సమస్యను సమస్యగానే వదిలి వేయటమో, పరిష్కారాన్ని పాఠకుని ఊహకు వదిలివేయటమో రచయిత చేతిలోని కలం నిర్దేశిస్తుంది. కానీ ఒక చమక్కు, ఒక స్పార్క్ ఉంటే అది పాఠకుడి మనసుని […]

More

సాహితీ చరిత్రకు కొత్త చేర్పు ‘సబ్బని ‘ వ్యాసాలు

ఆధునిక తెలుగు సాహిత్యంలో విశేషమైన ఆదరణ పొందిన రచయితల, కవుల రచనల గురించి అవగాహన పెంచుకోవడానికి తప్పనిసరిగా చదవాల్సిన ఒక ఉత్తమ గ్రంథం ‘ సబ్బని సాహిత్య వ్యాసములు’. మొక్కుబడిగా కాకుండా ఒక పరిశోధనాత్మకమైన విద్యార్థిలాగా, ఎంపిక చేసుకున్న రచనల నేపథ్యాలను, ఇతివృత్తాలను విశ్లేషణాత్మకంగా లిఖించారు సబ్బని లక్ష్మీనారాయణ. గత రెండు దశాబ్దాల్లో రాసిన ఈ 24 సాహితీ వ్యాసాలు ఆయన పాండిత్యానికి నిదర్శనం. ఈ వ్యాసాల సంపుటిని ఆయన తెలుగు సాహిత్యానికి, తెలంగాణ తెలుగు సాహిత్యానికి […]

More

ఆలోచింపజేసే కథానికలు….

కొన్ని కథలు నిద్రపుచ్చుతాయి. కొన్ని కథలు నిద్ర మేల్కొలిపి, ఆలోచింపజేస్తాయి. ఆసక్తికరంగా చెప్పడం ఒక కళ. కథను చెప్పేతీరును బట్టి దాన్ని చదవడానికి, వినడానికి, మనం ఇష్టపడతాము. పెద్ద కథలు, చిన్న కథలు, బుల్లి కథలు – రకరకాల కథలు ఇప్పుడు వస్తున్నాయి. కొన్ని కథలు ప్రదర్శనయోగ్యంగా మలచబడి నాటికలుగా, నాటకాలుగా, సినిమాలుగా, టీవీ సీరియళ్ళుగా రకరకాలుగా వస్తున్నాయి. బలమైన కథనుబట్టే వాటికి లభించే ఆదరణ ఉంటుంది. ఇప్పుడు కథలకు ఆదరణ పెరిగింది. చదివే అలవాటు క్రమంగా […]

More