Sripada | తెలుగు కథా శిఖరం శ్రీపాద

వడ్లగింజ,గులాబీ అత్తరు కథలు ఆణిముత్యాలు తండ్రి సంస్కృతంలో మహా పండితుడిని చేయాలనుకున్నాడు.కానీ విధి ఆ కుమారుడిని తెలుగు భాషలో కథాచక్రవర్తిని చేసింది. ఆయనే శ్రీపాద సుబ్రహ్మణశాస్త్రి .తండ్రి ఆదేశంతో సంస్కృతం నేర్చుకోవడానికి గుంటూరు సీతారామశాస్త్రి దగ్గరకు వల్లూరు వెళ్లారు.అక్కడే ఆయన జీవితం మలుపుతిరిగింది.ఒక ముసలావిడ ఈ పిల్లవాడిని మదనకామరాజు కథలు తెలుగులో చెప్పమని కోరింది.దాంతో ఆయన ఆ పుస్తకం పలుమార్లు చదివి స్వయంగా తెలుగు నేర్చుకున్నాడు. అప్పుడే తెలుగులోని మాధుర్యాన్ని గ్రహించాడు.అంటే తెలుగు భాషపై మమకారాన్ని పెంచుకున్నాడు. […]

More