ఫ్యూచర్ స్టేట్‌గా అభివృద్ధి చేస్తున్నాం
దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక భూమిక
రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలి
రాష్ట్రాల పన్నుల వాటాను 41 నుంచి 50శాతానికి పెంచాలి
16వ ఆర్ధిక సంఘం భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి సూచన
హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్‌అని.. మా రాష్టాన్న్రి ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని పేర్కొన్నారు. మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ… ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. భారీ రుణ భారం తెలంగాణకు సవాల్‌గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్`బడ్జెట్ రుణాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సవిూకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు మాకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రుణాన్ని రీ స్టక్చర్ర్ చేసే అవకాశం ఇవ్వాలని.. లేదా మాకు అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలని రేవంత్ పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్టాల్రకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50శాతానికి పెంచాలన్నారు. అన్ని రాష్టాల్ర తరపున ఈ డిమాండ్‌ను విూ ముందు ఉంచుతున్నామన్నారు. ఈ డిమాండ్ ను విూరు నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానవిూగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. తెలంగాణను తాము ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని రేవంత్ అన్నారు. తెలంగాణకు తగినంత సహాయం అందించాలని.. దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యతను నేరవేరుస్తామన్నారు. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో విూ మద్దతు కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు విూ సిఫారసులు ఉపయోగపడతాయని మేం నమ్ముతున్నామని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. నేడు ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. పన్నుల నుంచి తెలంగాణకు వచ్చే ఆదాయం వాటాను 41శాతం నుంచి 50శాతానికి పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్టాన్రికి జీవరేఖ లాంటివని.. ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు, అధిక భద్రతను కల్పిస్తాయన్నారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారన్నారు. ఫలితంగా కేంద్ర ప్రాయోజిక పథకాలను పొందడంలో రాష్టాల్రు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్టాల్రు తమ అవసరాలు కనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని అందించాలని భట్టి కోరారు. తెలంగాణ రాష్ట్రం కీలక దశలో ఉన్నదని… వేగంగా అడుగులు వేస్తోందన్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 6.85 లక్షల కోట్లకు పైగా రుణపాఠంతో సతమతం అవుతున్నదన్నారు. సెస్‌లు, సర్ చార్జీల్లో రాష్టాల్రకు వాటా ఇవ్వాలన్నారు. స్థూల పన్ను ఆదాయంలో రాష్టాల్ర వాటా తక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందన్నారు. ఇది తెలంగాణ డిమాండ్ కాదని.. అన్ని రాష్టాల్రకు సంబంధించినదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని… చారిత్రిక కారణాల వల్ల అసమాన అభివృద్ధి ఇక్కడ ఉన్నదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందని వెల్లడిరచారు. ఇలాంటి అసమానతల మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైందన్నారు. సమానతల పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
