నరేంద్ర మోడీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు తిప్పి కొట్టాలి
ఖమ్మం: నరేంద్ర మోడీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు తిప్పి కొట్టాలి.. బ్రిటిష్ కంటే బీజేపీ ప్రమాదకరమని, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అందరం ఏకమవుదామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1040, 100 ఏళ్ల చరిత్ర గలిగిన కాంగ్రెస్, సీపీఐ పోరాటాల వల్లనే అనేక హక్కులు సాధించగలిగామని తెలిపారు. బ్రిటిష్ ఉద్యమంలో రెండు పార్టీల పోరాటాలతోనే స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామన్నారు. వచ్చిన స్వాతంత్య్రంలో ప్రధాన నరేంద్ర మోడీ అనేక విధానాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి హక్కులను కాల రాస్తున్నారన్నారు.
జమీందారుల నుంచి వేల ఎకరాలను పంచిపెట్టారు : దున్నేవాడిదే భూమి అనే నినాదంతోనే ఇందిరాగాంధీ అగ్రికల్చర్ తీసుకొచ్చి జమీందారుల నుంచి వేల ఎకరాలను పంచిపెట్టారని గుర్తు చేశారు. రైతు పండించిన ధరలను గిట్టుబాటు రావటం లేదని కమ్యూనిస్టులు చేసిన పోరాటాలతోనే కాంగ్రెస్ పార్టీ రైతు చట్టాలను శాసనం తీసుకొచ్చి దళారి వ్యవస్థను అడ్డుకట్ట వేయడం జరిగిందన్నారు. బీజేపీ పార్టీకి ఖమ్మం జిల్లాలో స్థానం లేదు.. అందుకే మిత్రులారా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ సీఎం మాట్లాడారు.
