జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

తెలంగాణ

ఎవరుపడితే వారు జర్నలిస్ట్‌ అవతారం
ఏదిపడితే అది యూట్యూబుల్లో ప్రచారం
అసలు జర్నలిస్టులెవరు మీరే తేల్చండి
పార్టీ బాకా పత్రికల జర్నలిస్టుల గురించి ఆలోచించాలి
జవహర్‌ లాల్‌ నెహ్రూ సొసైటీకి స్థలం అప్పగింత
హైదరాబాద్‌ : ఎవరుపడితే వారు జర్నలిస్టులుగా అవతారమెత్తి, జర్నలిస్ట్‌ వృత్తికే కళంకంగా మారారని, అంటి వారిని దూరం పెట్టాల్సిన బాద్యత అసలు జర్నలిస్టులపైన ఉందని సిఎం రేవంతం రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు, వారి ప్రయోజనాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఎవరు జర్నలిస్టులో తెలియని పరిస్థితి ఇప్పుడు దాపురించిందని అన్నారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీకి ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన అధికారిక పత్రాలను ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి అధికారికంగా పట్టా పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్ట్‌లు హద్దులు దాటి వ్యవహారించకూడదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఎంపీలు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, విూడియా అకాడవిూ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ..కొంతమంది జర్నలిస్టులు చీఫ్‌ మినిస్టర్‌ను చీప్‌ మినిస్టర్‌ అంటూ కుర్చీకు ఉన్న గౌరవం పొగొడుతున్నారు. వ్యక్తి నచ్చక పోవచ్చు వ్యవస్థలో గౌరవప్రదమైన పదవికి విలువ ఇవ్వాలి. ఎదుటి వారు విలువలు దాటితే మేము దాటుతాం. అక్రిడిటేషన్‌ విషయంలో ఈసారి కచ్చితంగా నిబంధనలు ఉంటాయి. జర్నలిస్ట్‌లకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వారు ఎలా ఉన్నారో ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాల్లో చిట్‌చాట్‌లను సైతం ఇంకొకలాగా రాస్తున్నారు. గతంలో గాంధీ భవన్‌లో సన్నిహితంగా మాట్లాడిన మాటలను రికార్డు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే జర్నలిస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆరోగ్య శ్రీ కార్డుల విషయంలో ఎవరికి ఎలాంటి అపోహాలు అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.సమాజంలో జర్నలిస్ట్‌ల సమస్యలను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆనాడే గుర్తించారని తెలిపారు. 11 వందలమంది జర్నలిస్టులకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సంతోషమని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది బాధ్యతగా వ్యవహరించడం లేదని అన్నారు. రాష్ట్ర విభజన లాంటి అంశాన్నే కాంగ్రెస్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు తమ ప్రభుత్వంలో త్వరగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హావిూ ఇచ్చారు. ఇచ్చిన హావిూ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థలాల స్వాధీన పత్రం అందచేస్తున్నామని అన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న దాని పరిష్కారానికి మాత్రమే తాము పని చేస్తామని తేల్చిచెప్పారు. వృత్తి పరమైన గౌరవాన్ని జర్నలిస్టులు పెంచుకోవాలని సూచించారు. ఇప్పటి రాజకీయాలపై సరైన అభిప్రాయం ప్రజల్లో లేదని అన్నారు. రాజకీయాలు, రాజకీయ నాయకులు అన్న ప్రజల్లో చిన్నచూపు ఉందని తెలిపారు. కేవలం కుటుంబ సభ్యుల కోసం పని చేస్తారనే అపవాదు ప్రజల్లో ఉందని విమర్శించారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు లోపలికి వెళ్లే అవకాశం లేదని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్లే అంశం దేవుడేరుగు అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. సిద్దాంత పరమైన అంశాల కోసం మాత్రమే అప్పట్లో రాజకీయ పార్టీలు, పత్రికలు పెట్టుకున్నాయని గుర్తుచేశారు. దీనికి నిదర్శనం కమ్యూనిస్టు పార్టీలని తెలిపారు. గత ప్రభుత్వంలో సెక్రటేరియట్‌కు ప్రజా ప్రతినిధులు కూడా వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. ఈరోజు జర్నలిస్ట్‌లు సైతం సచివాలయంలోకి వెళ్లవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది జర్నలిస్ట్‌లు సెక్రటేరియట్‌లో అనవసర రాద్దాంతం సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాంటి జర్నలిస్ట్‌లకు విలువ లేదని స్పష్టం చేశారు. ఎవరిని చూసిన తాము యూట్యూబ్‌ జర్నలిస్టులమని అంటున్నారని… కొందరు ఇంకేదో జర్నలిస్టులమని చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడిరచారు. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సింది విూరేనని అన్నారు. అసలుసిసలు జర్నలిస్టులు ఎవరన్నది విూరే తేల్చండి అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *