2000 ఛాంపియన్స్ ట్రోఫీ (ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఫైనల్ లో భారత్ పై సెంచరీ బాది విజయంలో కీలకంగా వ్యవహరించిన ఆటగాడు అతడు. ఫియర్‌లెస్ క్రికెటర్‌గా, ఆల్‌రౌండర్‌గా భారత క్రికెట్ అభిమాన మనసు దోచుకున్న న్యూజిలాండ్ ప్లేయర్ అతడు. కానీ ఆ తర్వాత పాతాళానికి దిగజారిపోయి.. కూలీగా, క్లీనర్ గా కెరీర్ జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అతడు మరెవరో కాదు క్రిస్ కెయిన్స్. క్రిస్ కెయిన్స్ కు ఆస్తి పాస్తులూ బాగానే ఉండేవి. కానీ అతడు ఆటలో రిటైర్ అవ్వకముందే స్వీయ తప్పిదాలతో ఆర్థికంగా పాతాళానికి పడిపోయాడు. కెయిన్స్ ఆ రోజుల్లో వజ్రాల వ్యాపారం కూడా చేశాడు. కానీ విలాసాలకు అలవాటుపడి డబ్బును పొదుపు చేయలేకపోయాడు. చివరకు అప్పులు, నష్టాలు అతడి జీవితాన్ని నిండా ముంచేశాయి. ఈ క్రమంలోనే ఆటలోనూ కిందకు పడిపోయాడు. చివరకు ప్రాణాపాయ స్థితిలోనూ మరొకరిపై ఆధారపడాల్సిన దుస్థితిలోకి వెళ్లిపోయాడు. అతడికి ఓ దశలో గుండెపోటుతో ఆస్పత్రిలోనూ చేరాడు. చికిత్సకు డబ్బులు లేక ఎంతో అవస్థలు పడ్డాడు. ఫైనల్ గా తన జీవితం గడవడానికి కూలీగా మారాడు కెయిన్స్. ట్రక్ డ్రైవర్‌గానూ పని చేశాడు. చివరికి బస్సులు కూడా శుభ్రం చేశాడు.
