మహోన్నత శిఖరం సావిత్రి భాయి పూలే

తెలంగాణ
 అంబెడ్కర్ యువజన సంఘం

సృజన క్రాంతి/మిర్యాలగూడ రూరల్ :
భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘసంస్కర్త. జ్యోతిరావు పూలే గారి సతీమణి. సావిత్రిబాయి పూలే వర్ధంతి నీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ స్టీరింగ్ కమిటీ సభ్యులు దైదా.సత్యం, కత్తుల.సూర్యనారాయణ, ఉబ్బపళ్లి కాశయ్య గార్లు, మాట్లాడుతూ- సావిత్రిబాయి పూలే భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘసంస్కర్తమహిళా విద్యలో అగ్రగామి: సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు. 1848లో, ఆమె సామాజిక నిబంధనలను ఉల్లంఘిస్తూ పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించింది: వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించినరని అన్నారు:


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రీబాయి ఫూలే వితంతువుల హక్కుల కోసం వాదించేది. ఆమె వితంతువులను లేమి జీవితంలోకి నెట్టివేసే ప్రబలమైన ఆచారాలకు వ్యతిరేకంగా మరియు వితంతువులు పునర్వివాహం చేసుకునే హక్కు కోసం ప్రచారం చేసింది. వారు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు మరియు విద్య మరియు అవగాహన ద్వారా అట్టడుగు కులాల అభ్యున్నతికి కృషి చేశారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ . రామ్ నాగయ్య, పోలేపాక సురేందర్, ఉపాధ్యక్షులు భాస్కర్, నందిపాటి నరేష్, జొన్నపాల శ్రీనివాస్, కోశాధికారి అవిరెండ్ల సందీప్ , కార్యదర్శి పందిరి పరుశురాం, ఉబ్బపల్లి శంకర్.వట్టెపు సుధీర్,k. విష్ణు, A. విజయ్, ఉబ్బపళ్లి నాగేష్, ఉబ్బ పల్లి రాజేష్. దైద రాందాస్, శ్రీకాంత్, గోపి, రాజీవ్, శరత్, బాల సైదులు, sk రుహిద్ ,మోహిద్, గూడపూరి విజయ్.దళితరత్న కొత్తపల్లి సైదులు. దైద సైదులు. దైదసాయినాథ్.పవన్,అజ్జు. ఉబ్బపల్లి రాఘవేంద్ర. శ్రీరాములు. వస్కుల అజయ్. తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం వార్డు కమిటీలు నియామకం జరిగింది.ఇందిరమ్మ కాలనీ 6వార్డ్ అధ్యక్షులుగా పరకాల సురేష్,జనరల్ సెక్రటరీగా. కోడి రెక్క భరత్ లు,గాంధీనగర్ 34 వార్డు అధ్యక్షులు,సెక్రెటరీలుగా
ఉబ్బపల్లి మహేష్,ఉబ్బపల్లి పవన్ గాంధీనగర్ 35 వ వార్డు అధ్యక్షులుగా ఉబ్బపల్లి రాజ్ కుమార్,జనరల్ సెక్రెటరీ. మామిడి సతీష్* నియామకం జరిగింది.

సావిత్రి భాయి పూలేకి ఘన నివాళి
మిర్యాలగూడ పట్టణం లోని జ్యోతిరావు పూలే భవనం బయట బిసి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, మరియు అన్ని కుల సంఘాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘ నాయకులు గుడిపాటి కోటయ్యలు మాట్లాడుతూ స్త్రీల విద్యకై కృషి చేసిన తొలితరం మహిళా ఉపాధ్యాయుని,స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకురాలు,కుల మతాలకతీతంగా స్త్రీ పురుషులు విద్యావంతులు కావాలని పాఠశాలలు నడిపి, ఎన్నో అవరోధాలను, ఆటంకాలను ఎదుర్కొంటూ ముందడుగు వేసిన సృజన శీలి…ప్రపంచమే ఇల్లుగా చేసుకొని అనాధ, అక్రమసంతానాన్ని బిడ్డలుగా ఆదరించిన సామాజిక విప్లవ మాతృమూర్తి…కరువు కాలాన జోలెపట్టి విరాళాలు సేకరించి ఆదుకున్న నిబద్ధత కలిగిన మహిళ…ప్లేగు వ్యాధిగ్రస్తులపై వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించిన సమాజ సేవకురాలు… తొలి మహిళా సంఘ సంస్కర్త అని. ఉపాధ్యాయురాలుగా సమాజాన్ని మార్చిన ధీరవనిత చైతన్య స్ఫూర్తి అని ఆమే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా ఏరియా హాస్పిటల్ పక్కన ఉన్న జ్యోతిరావు పూలే భవనం మున్సిపాలిటీ కమిషన్ సార్ మరియు మున్సిపాలిటీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ సార్ భవనం అందుబాటులోకి తీసుకురావాలని కోరుచున్నాము.. బదిలీపై వెళ్లిన మున్సిపాలిటీ కమిషనర్ సార్ని కలవగా ప్రస్తుతానికి భవనంలో నీళ్లవసతి కల్పించుట కొరకు బోర్లు వేసిన నీళ్లు పడలేదని భవనం అందుబాటులోకి తీసుకురావాలంటే కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నవి సంపులు ఏర్పాటు చేసి నీళ్లు ఏర్పాటు చేస్తామని కమిషనర్ గారు తెలియజేశారు ఈ సదుపాయాన్ని వెంటనే ఏర్పాటు చేసి బిల్డింగ్ ని అందుబాటులోకి తీసుకురావాలని బీసీ జెఏసి ఆధ్వర్యంలో కమిషనర్ గారికి చైర్మన్ గారికి విన్నవించుకుంటున్నాము;… అదేవిధంగా కొంతమంది సోదరులు ఈ మధ్యకాలంలో ఈ భవనాన్ని బిసి మండపముగా అని ప్రచారం చేశారు ఇది మండపం కాదు జ్యోతిరావు పూలే భవనం కుల సంఘాలు, ఉద్యోగులు సమావేశాలు జరుపుకొనుటకు మాత్రమే ఈ భవనము అని గమనించాలి కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో కుల సంఘాలు, ఉపాద్యాయ సంఘాల నాయకులు జేఏసీ కో కన్వీనర్ జయరాజు, జిల్లా బిసి ఉద్యోగుల అధ్యక్షులు సర్నాల వెంకన్న, డివిజన్ యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, బిసి సంఘం నాయకురాలు బంటు కవిత, బీసీ నాయకులు నాగభూషణం, సుదర్శన్ రెడ్డి,ఆంగోతు కురువా, గిరిజన ఉపాద్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ర కృష్ణ కాంత్ నాయక్, టి.జి.యు.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడ్ తిరుపతి నాయక్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ధీరావత్ ధర్మా నాయక్, ఆంబోతు తావుర్య నాయక్, రాజేశ్వరి, మంగా తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిభాయి పూలే గారి సేవలు మరువలేనివి : దళితరత్న కొత్తపల్లి సైదులు
సంఘసంస్కర్త మాత సావిత్రిబాయి ఫూలే గారి 127 వర్ధంతి సందర్భంగా దళితరత్న కొత్తపల్లి సైదులు, మేధా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలకు ఎదురొడ్డి బాల్యవివాహాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళలకు ఉన్న కట్టుబాట్లను తెంచివేస్తూ,తనకి పిల్లలు అవసరం లేదని సమాజం లోని నిరాశ్రాయులే తనపిల్లలని ఆదరిస్తూ,జాతిని తట్టి లేపుతూ, మహిళల జీవితాలలోని చీకట్లను పారదోలి వారి జీవితాలకు వెలుగులు నింపే విద్యను ప్రసాదించిన తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు అమ్మ శ్రీ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి మిర్యాలగూడ లో ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను,ఆలోచనలను మనమంతా ఆచరించి, పాటించాలని అదే వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *