గతంలో 3 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 8చోట్ల గెలిపించారు
గెలుపోటములకు పిసిసి చీఫ్‌గా బాధ్యత తనదే
బిజెపికి బిఆర్‌ఎస్ పూర్తిగా అమ్ముడుపోయింది
ఉమ్మడి ఏపీ సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం
విూడియా సమవేశంలో సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్ : ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఇది తమకు ఉడాది పచ్చడి లాంటిదని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్మలెంట్ ఎన్నికల్లో తమ విూద విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్నిచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖర్గే, సోనియా దిశానిర్ధేశంతో మంచి ఫలితాలు సాధించామని స్పష్టం చేశారు. వంద రోజుల పాలను ప్రజలు ఆదరించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మా ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ పాలనను మెచ్చుకుని ప్రజలు ఓటేశారని వెల్లడిరచారు సీఎం రేవంత్ రెడ్డి. 2019లో మూడు ఎంపీ సీట్లు ఇస్తే 2024లో ఆ సంఖ్య 8కి పెరిగిందని చెప్పారు. బీజేపీ గెలిచిన 8 సీట్లలో బీఆర్‌ఎస్ 7 చోట్లలో డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించారన్నారు. జేపీని గెలిపించడానికి కేసీఆర్ బలహినమైన అభ్యర్థులను పెట్టారంటూ ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి విూడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో హరీష్ రావు బీఆర్‌ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించారన్నారు. కేసీఆర్, హరీష్ కలిసి మెదక్ లో బీజేపీని గెలిపించారని తెలిపారు. వెంకట్రామిరెడ్డిని నమ్మించి మోసం చేశారని తెలిపారు. 37 శాతం ఓట్లున్న బీఆర్‌ఎస్‌కు 16 శాతానికి చేరిందన్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులును రాహుల్ గాంధీ ఏకం చేశారని చెప్పారు సీఎం రేవంత్. మోదీ వ్యతిరేక విధానాలను రాహుల్ ప్రజలకు వివరించారు. అలాగే తెలంగాణలో వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చితే ఓటు వేయాలని లోక్‌సభ ఎన్నికల్లో కోరామని.. 8 మంది తమ అభ్యర్థులు గెలిచారని చెప్పారు. వందరోజుల పాలన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయన్నారు. అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువగా లోక్‌సభ ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మేం భావిస్తున్నాం. 8 మంది ఎంపీలను గెలిపించి ఆశీర్వదించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. 2019 ఎన్నికల్లో మాకు 3 సీట్లు వస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరింది. భారాస ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఆ 7 సీట్లలో భాజపాను గెలిపించి అవయవదానం చేశారు. భారాస నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి భాజపా నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారు. మెదక్‌లో కాషాయ పార్టీ విజయానికి హరీశ్‌రావు సహకారం అందించారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇదిలావుంటే ప్రజల తీర్పును గౌరవించి ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదన్నారు. ఎన్‌డిఎ మిత్రపక్షాలు మోదీని రాజీనామా కోరాలన్నారు. మోదీ హుందాగా రాజీనామా చేసి ప్రధానిగా తప్పుకుంటే బాగుంటుదని తెలిపారు. రాజకీయ విలువలు చెప్పడానికే మోదీ కానీ వాటిని పాటించరని విమర్శించారు. రాముడి పేరుతో ఓట్లు అడిగితే దేవుడే గుణపాఠం చెప్పాడన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్‌డి, ఇండియా కూటమికి సమానంగా ఫలితాలు వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి . మోదీ గ్యారెంటీ పేరుతో వెళ్తే జనం తిప్పికొట్టారని చెప్పారు. మోదీ కాలం చెల్లిందని ప్రజలు తీర్పు చెప్పారన్నారు. ఎన్నికల ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివని చెప్పారు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరసావహిస్తామని అన్నారు. గెలుపు, ఓటమి అన్నీటికీ పీసీసీ చీఫ్ గా, సీఎంగా తనదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. తమకు ఎవరితో ఎలాంటి భేషాజాలు చెప్పిన సీఎం రేవంత్… రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడుతామన్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎపిలో చంద్రబాబు ప్రమాణానికి ఆహ్వానిస్తే వెళతామన్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ రాజధాని అని, మిగతా సమస్యలప ఇకముందు కలిసి చర్చించుకుంటామని అన్నారు. విూడియా సమావేశంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్., కడియం శ్రీహరి, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
