సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం వేస్తున్న వెనుక అడుగు కూటమి పార్టీలపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లుతుంది.ఎన్నికల సమయంలో అలవికాని హామీలు కుమ్మరించడం,ఆనక వాటిని అమలు చేయలేక బొక్కబోర్లాపడడం సాధారణమైపోయింది.ఏపీలో ప్రస్తుతం పరిస్థితి అలాగే కనిపిస్తున్నది.బుడమేరు విజయవాడను ముంచెత్తడం,వరుస తుఫానులో రాష్ట్రంలో పంటలు దెబ్బతినడం వంటి ఆటంకాలు కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారింది.దానికి తోడు గత ప్రభుత్వం చేసిన బకాయిలు కూడా ఆర్ధిక అస్తవ్యస్తం కు దారి తీసింది.అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అమలు చేస్తామని చంద్రబాబు అండ్ కో అధికారంలోకి వచ్చారు.అధికారం చేపట్టి ఐదు నెలలు అవుతున్నా అభివృద్ధి జాడలేదు.అప్పులు మాత్రం 47 వేల కోట్లకు చేరిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించడం గమనార్హం. కాని చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి వృద్ధాప్య పింఛన్లు,ఉద్యోగులు జీతాలు మాత్రం టంఛన్ గా ఒకటో తారీఖున ప్రభుత్వం చెల్లిస్తున్నది. సూపర్ సిక్స్ అమలు దీపావళితో మొదలుపెట్టారు.మొదట ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మిగిలిన ఐదు హామీలు ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు.ఆగస్టు 15తో ఉచిత బస్సుపథకం ప్రారంభం అన్నారు.ఇప్పుడు సంక్రాంతి నుంచి అంటున్నారు. రైతులకు పెట్టుబడి,పిల్లల చదువుకు ఇచ్చే విద్యాగ్రాంట్ తదితరాలు ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతోంది. వైసీపీ నాయకులకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు అవుతున్నది.తాను అధికారంలో ఉంటే బటన్ నొక్కి ప్రజలకు పథకాల నిధులు విడుదల చేసేవాడినని,కూటమిని ఎన్నుకుని మోసపోయారని జగన్ ప్రచారం చేయడంతో వారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.ప్రతి అవకాశాన్ని జగన్ వదలకుండా ప్రభుత్వం పై నిప్పులు చెరగుతున్నారు.అలాగే రాష్ట్రంలో అభివృద్ధి చూపించాలి.అమరావతికి కేంద్రం ఇప్పించే రుణాలతో అభివృద్ధి చేయవచ్చు.పోలవరం కేంద్రనిధులతో పూర్తి చేయవచ్చు.కాని ప్రజలు తమకు లభించే తాత్కాలిక ప్రయోజనాలను ఆశిస్తారు.అందుకు సూపర్ సిక్స్ తక్షణమే అమలుచేయాలి.ఇప్పటికే ఇసుక,మద్యం విధానాలు దారిలో పెట్టినా మైలేజీ పెద్దగా రాలేదు.దందాలు చేయవద్దని సొంత పార్టీ నాయకులకు హెచ్చరికలు చేసినా అంతగా ప్రజలు నుంచి స్పందన లేదు.బుడమేరు మునకలో స్వయంగా సీఎం రాత్రిపగలుకష్టపడినా,నష్టపరిహారం చెల్లించినా ప్రజలు సన్మానాలు చేయలేదు.ఎన్నడూ లేనంతగా విరాళాలు వచ్చినా,డిప్యూటీ సీఎం లడ్డూ వివాదంలో సనాతన ధర్మాన్ని ఎలుగెత్తి చాటినా మైలేజీ అనుకున్నంత రాలేదు.అభివృద్దిచూపాలంటే బడ్జెట్ లో కేటాయింపులు సరిగా ఉండేలా చూడాలి.15శాతం మేర అభివృధ్ది బడ్జెట్లో చూపేలా జాగర్తలు పాటించాలి.అదిసాధించడం సమర్దుడైన చంద్రబాబుకు పెద్దగా కష్టంకాదని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.ఈ కష్టాలకు తోడు గత ప్రభుత్వ పాపం పెరగనున్న సర్దుబాటు కరెంట్ చార్జీలు యూనిట్లకు 1.58 పైసలు కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది.ఏదిఏమైనా సూపర్ సిక్స్ పై దృష్టి పెట్టకపోతే కూటమికి డేంజర్ బెల్స్ మోగే ప్రమాదం ఉందని,అదీ సంవత్సరం రాకముందే వీలైనంత త్వరలో అమలు చేయాలని పార్టీవర్గాలు కూడా భావిస్తున్నాయి.మరి చంద్రబాబు చాణిక్యం ఏమి ఫలితం ఇస్తుందో వేచి చూడాలి.
యం.వి.రామారావు,8074129668