నోటీసులకు నోటీసులతోనే …
కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ ఘాటు సమాధానం
హైదరాబాద్ : లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే. అందుకు బదులుగానే నేను మాట్లాడాను. ఆయన బాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం ముందుకు వెళ్తాం అని అని బండి సంజయ్ పేర్కొన్నారు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కేంద్రమంత్రి బండిసంజయ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్రమంతి ఘాటైన జవాబిచ్చారు. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా.. విమర్శలకు నోటీసులే సమాధానమా.. అయితే నీకు నోటీసులు పంపుతా… కాచుకో. నువ్వు సుద్దపూస అనుకుంటున్నవా.. నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన. మాటకు మాట… నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు విూడియాలో చూసినట్లు తెలిపారు. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందని… స్పష్టం చేశారు. తనపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే అని చెప్పుకొచ్చారు. అందుకు బదులుగానే మాట్లాడినట్లు తెలిపారు.కేంద్రమంత్రి బండి సంజయ్‌కు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని .. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. అక్టోబర్ 19న బండి సంజయ్ విూడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని నిరాధారణ ఆరోపణలు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా కేంద్రమంత్రి ప్రస్తావరించారని నోటీసుల్లో పేర్కొన్నారు.
