ఆరా, పార్థా సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలు
సృజనక్రాంతి/అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఆరా సర్వే సంస్థ యజమాని మస్తాన్ వెల్లడిరచారు. ఏపీలో హోరాహోరీగా సాగిన పోలింగ్ లో.. వైసీపీదే ఆధిక్యం అని.. ఈ విషయం 22 రోజుల పరిశీలన తర్వాత అంచనాకు వచ్చి నట్లు వెల్లడిరచారు. పార్థా సంస్థ కూడా ఇదే విషయాన్ని వెల్లడిరచింది. వైసిపి అధికా రంలోకి వస్తోందని వెల్లడిరచింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 సీట్లతో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తున్నట్లు మస్తాన్ చెప్పారు. టీడీపీ కూటమి 71 నుంచి 81 మధ్య సీట్లను గెలుస్తుందని వెల్లడిర చారాయన. టిడీపీ కూటమి కంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనంగా 25 సీట్లు రాబోతున్నాయని సర్వేలో వెల్లడైనట్లు ఆరా మస్తాన్ వివరించారు. ఇక పార్ల మెంట్ సీట్ల విషయానికి వస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 15 లోక్ సభ సీట్లలో గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్.. టీడీపీ కూటమి 10 నుంచి 12 సీట్లలో గెలవబో తుందని వివరించారాయన. జన సేన పార్టీ పోటీ చేసిన రెండు పార్లమెంట్ సీట్లలో ఆ పార్టీనే విజయం సాధిస్తుందని వివరించారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ఓట్లను భారీగా చీల్చిందని.. దీని వల్ల మూడు పార్లమెంట్ సీట్లను వైసీపీ కోల్పోవాల్సి వస్తుం దని.. ఇది ఆ పార్టీకి నష్టం చేకూర్చిందన్నా రు. కొంచెం అటు ఇటుగా పార్థా సంస్థ కూ డా వైసిపికే మళ్లీ అధికారం అని పేర్కొంది.