నెల్లూరు : తై అమావాస్య సందర్భంగా రామ్ నగర్ లోని శ్రీ వైద్య వీరాఘవ స్వామి గుడిని .ప్రత్యేక పూజలు నిర్వహించారు .మంత్రి నారాయణకు రూరల్ టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్,మాజీ మేయర్ భానుశ్రీ ఘన స్వాగతం పలికారు . నెల్లూరు నగరం రామ్ నగర్ లోని వేమాల శెట్టి బావి వైద్య వీర రాఘవ స్వామి ఆలయానికి 400 వందల సంవత్సరాల చరిత్ర ఉంది.ఇక్కడ స్వామి వారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తిరడంతో పాటు ప్రజలకు అనారోగ్యాలు కూడా నయం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం..ఆలయ సాంప్రదాయాలు ప్రకారం మంత్రి నారాయణ ఆలయ ప్రాంగణంలోని శివలింగం పై ఉప్పు,మిరియాలు వేసి పూజలు చేసి పక్కనే ఉన్న బావిలో బెల్లం వేసి మొక్కులు తీర్చుకున్నారు .మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు,భవిష్యత్తు లో ఆలయ అభివృద్ధికి నా సహకారం అందిస్తానన్నారు . ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్ ,రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ,మాజీ మున్సిపల్ ఛైర్పర్సత్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి ,సిటీ టీడీపీ నేతలు పాల్గొన్నారు .
