తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణ

ఆంధ్రప్రదేశ్

ఎన్‌సీసీఆర్‌, కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ జోన్‌ అథారిటీ మధ్య ఒప్పందం : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
సృజనక్రాంతి/అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టిపెట్టారు. తీర ప్రాంతంలో అలల ఉద్ధృతికి భూమి కోతను నివారించేలా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రిసెర్చ్‌(ఎన్‌సీసీఆర్‌), ఏపీ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ జోన్‌ అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది. తీర ప్రాంత నిర్వహణపై ఎన్‌సీసీఆర్‌ రూపొందించిన ప్రణాళికను డిప్యూటీ సీఎం విడుదల చేశారు.ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. సముద్రపు కోత ప్రమాదాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సవిూక్షించి నిపుణులతో చర్చించామన్నారు. రాష్ట్రంలోని తీరం వెంట కోత సమస్య ఎక్కడెక్క ఉంది? వాటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులను పవన్‌ ఆదేశించారు. కొత్త ఓడ రేవులు, ఫిషింగ్‌ హార్బర్ల కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీర ప్రాంత కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. తీర ప్రాంత నిర్వహణపై ఎన్సీసీసీఆర్‌ రూపొందించిన ప్రణాళికను విడుదల చేశారు. తీర ప్రాంత నిర్వహణకు ఎన్సీసీసీఆర్‌, ఏపీసీజడ్‌ఎంఏల మధ్య అవగాహన ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. రాష్టాన్రికి 973 కి.విూ.కిపైగా ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరం… తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సముద్రపు కోత ఆందోళన కలిగిస్తోంది, కోత ప్రమాదాన్ని నివారించేనీదుకు ప్రత్యేక దృష్టిపెడుతున్నామని వివరించారు. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సవిూక్షించి నిపుణులతో చర్చించామని అన్నారు. రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యల గురించి అధ్యయనం చేయాలని ఆదేశాలిచ్చామని అన్నారు. తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికను డిప్యూటీ సీఎం విడుదల చేశారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ (ఎన్‌.సి.సి.ఆర్‌.) నిపుణులతో ప్రణాళిక రూపొందించామని వివరించారు. ఈ ప్రణాళిక తీర ప్రాంతంలో తీర ప్రాంతాల కోత, కెరటాల శక్తి తగ్గింపుతోపాటు కోత, కెరటాల తీవ్రత నుంచి వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకూ ఉపయోగపడుతుందని చెప్పారు. కొత్త ఓడ రేవులు, ఫిషింగ్‌ హార్బర్లు లాంటి వాటి కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకోవడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుందన్నారు. ఎన్‌.సీసీఆర్‌., ఆంధ్ర ప్రదేశ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్మెంట్‌ అథారిటీలు మధ్య పవన్‌ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *