ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు దృష్టి

ఆంధ్రప్రదేశ్

అప్పులు, ఆదాయాలపై అధికారులతో ఆరా
మొత్తం రూ.14 లక్షలు కోట్ల అప్పులు ఉంటాయన్న అంచనా
శ్వేతపత్రం విడుదలకు సిఎం కసరత్తు
ఓటాన్‌ అకౌంట్‌ ద్వారా గట్టెక్కేందుకు యత్నం
సృజనక్రాంతి/అమరావతి : ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖపై సవిూక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్టాన్రికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికి అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా రూ.14 లక్షలు కోట్లు ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా పెండిరగ్‌ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సవిూక్షించనున్నారు. పెండిరగ్‌ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక శాఖ వివరాలు కోరింది. రాష్టాన్రికి వస్తున్న ఆదాయాలు.. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో అప్పులు, ఆదాయాలపై అధికారులను ఆరా తీశారు. పెండిరగ్‌ బిల్లులు ఎంత ఉన్నాయనే అంశంపైనా సీఎం చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై శాఖల వారీగా వివరాలు కోరినట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి బడ్జెట్‌ కాకుండా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఓటాన్‌ అకౌంట్‌ పెట్టే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో మూడు నెలలపాటు తాత్కాలిక బడ్జెట్‌ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్‌ ఉంది. మరో 4 నెలల పాటు ఓటాన్‌ అకౌంట్‌ కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులు బాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరి కొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.