అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా : ఎనిమిది మంది మృతి

రాయచోటి: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. లారీలో చిక్కుకున్న 9 మందిని రక్షించారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry