రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, విజయలక్ష్మికి ధైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సాయికృష్ణ అదృశ్య ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేయటంతో పాటు దర్యాప్తు వేగవంతం చేశామని తెలిపారు. తప్పుందని తేలితే ఎంతటివారైనా ఉపేక్షించనని సీఎం స్పష్టం చేశారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సీఎం వద్దకు తీసుకొచ్చారు.
What do you feel about this post?
0%
Like
0%
Love
0%
Happy
0%
Haha
0%
Sad
0%















Leave a Reply