అద్భుత నగరంగా హైదరాబాద్‌

తెలంగాణ

నాలాలు, భూముల కబ్జాలపై ఉక్కుపాదం
గంజాయి పేరు చెబితేనే వణకాలి
శాంతిభద్రతలపై రాజీ పడే ప్రసక్తి లేదు
మూసీ రివర్‌ ఫ్రంట్‌తో నగరానికి వన్నె
హైడ్రా ద్వారా సమగ్ర ప్రణాళిక అమలు
శాసనసభలో స్వల్పకాలిక చర్చలో సిఎం రేవంత్‌
సృజనక్రాంతి/హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో భూములు, నాలాల అక్రమాల నివారణకే హైడ్రా తెస్తున్నామని, దీని పరిధి 2వేల కిలోవిూటర్లకు విస్తరించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైడ్రాపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎస్‌వోటీ, గ్రేహండ్స్‌ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో ఇంటి నెంబర్లు మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే సంస్కరణలు తెస్తున్నామని అన్నారు. వైఎస్‌ఆర్‌ .. ఓఆర్‌ఆర్‌ నిర్మిస్తే కొందరు దాన్ని తాకట్టు పెట్టారని, ఓఆర్‌ఆర్‌ను తాకట్టు పెట్టిన వారు సభ నుంచి పారిపోయారని విమర్శించారు. హైదరాబాద్‌లో సరస్సులు మాయమవుతున్నాయి. నాలాల కబ్జాలతో హైదరాబాద్‌ అతలాకుతలమవుతోంది. మల్లన్నసాగర్‌ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశాం. రూ.6వేల కోట్ల ప్రతిపాదనలు ప్రధాని, జలశక్తిశాఖ మంత్రికి ఇచ్చాం. గతంలో రాత్రి 11 తర్వాత విచ్చలవిడిగా గంజాయి దొరికేది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరికైనా గంజాయి అమ్మే దమ్ముందా? పబ్బు, ఫామ్‌హౌస్‌ల్లో డ్రగ్‌ రాకెట్లతో ఎవరికి సంబంధం ఉందో చర్చించే దమ్ముందా అన్నారు. గంజాయి అంటే జడుసుకునేలా చేస్తున్నామని అన్నారు. శాంతిభద్రతల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. భారాస నేతలు సభలో ఉన్నప్పుడు డ్రగ్‌ రాకెట్లపై చర్చకు సిద్ధం. మాకు అందరి జాతకాలు తెలుసు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున కొన్ని అంశాలపై చర్చించట్లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి భిన్నాభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్‌ అభివృద్ధికి వారిద్దరూ కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డును వైఎస్‌ఆర్‌ మణిహారంగా తీర్చిదిద్దారని రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఓఆర్‌ఆర్‌ లోపల నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు హైడ్రాను సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. లాంగ్వేజ్‌, నాలెడ్జ్‌ వేర్వరని కేటీఆర్‌ తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హితవు పలికారు. అవతలి వారిని అవహేళన చేయకూడదనే అవగాహన ఆయన ఉండాలన్నారు. గత ప్రభుత్వంలో గజ్వేల్‌కు ఇచ్చిన నీరు శ్రీపాద ఎల్లంపల్లి పైప్‌ లైన్‌కు బొక్కపెట్టి తీసుకెళ్లినట్లు సీఎం ఆరోపించారు. దానం నాగేందర్‌ సభలో మాట్లాడితే తప్పేంటని, ఓ సభ్యుడికి మైక్‌ ఇవ్వొద్దనే అధికారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎక్కడిదని సీఎం ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరును ఓపికతో చూస్తున్నామని.. కోమటిరెడ్డి, సంపత్‌ని గత సభలో ఏం చేసారో మనం చూడలేదా? అని అన్నారు. ఓ అరడజను మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తే గాని వారికి బుద్ధి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగిపోయినట్లు రేవంత్‌ రెడ్డి అన్నారు. అయినా ఇంతవరకు ఎలాంటి డీపీఆర్‌ లేదని, కానీ మూసీ అభివృద్ధి పనులు మొదలు పెట్టకముందే కేటీఆర్‌ డీపీఆర్‌ అడుగుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. మూసీ కబ్జాలను త్వరలోనే తొలగిస్తామని వెల్లడిరచారు. అలాగే అక్రమంగా నిర్మించిన 10,800ఇళ్లు మూసీపై ఉన్నాయని, వారందరికీ ప్రత్యమ్నాయం చూపించి భూమి కేటాయిస్తామన్నారు. హైదరాబాద్‌లో రోడ్లపై నీరు ఆగకుండా వాటర్‌ హార్వెస్టింగ్‌ వెల్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. గుర్తించిన 141ప్రాంతాల్లో డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ సిబ్బంది ఉంటారని, ఆఫీసులకే పరిమితం అయిన అధికారులను ఫిజికల్‌ పోలిసింగ్‌ చేపిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అధికారులు రోడ్లపైకి రాకపోతే తానే వస్తానంటూ సీఎం చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంతో పోలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కైమ్ర్‌ రేటు తగ్గినట్లు సీఎం చెప్పుకొచ్చారు. అవసరాన్ని బట్టి ఒక్కో ప్రభుత్వ సంస్థను ఒక్కో సందర్భంలో తీసుకొచ్చారని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్‌ హైడ్రాను తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌ 300 ఏళ్ల క్రితమే అద్భుతంగా డిజైన్‌ చేయబడిరదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అవాస్తవాలు ప్రచారం చేసి బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభుత్వాన్ని, రాష్టాన్న్రి బలహీనం చేయాలని చూస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌ సిటీ విస్తరిస్తోందని కాబట్టే హైడ్రాను తీసుకొచ్చామని అన్నారు. 2వేల చ.కీ.విూ వరకు హైడ్రాను విస్తరిస్తామని తెలిపారు. హైడ్రాను 12 జోన్లుగా విభజించి.. జోన్‌ కు ఓ ఆఫీసర్‌ ను పెడతామన్నారు.గతంలో కండ్లముందే చెరువులు, నాలాలు కబ్జాకు గురైయ్యాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో కఠినంగా ఉంటామని సీఎం తెలియజేశారు. నాలాలు, చెరువులు కబ్జా చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. హైదరాబాద్‌ విస్తరిస్తుందనే ప్రపంచ దేశాల్లో స్టడీ చేసి హైడ్రాను రూపొందించామని ముఖ్యమంత్రి అన్నారు. నిజాం, ఉస్మాన్‌ సాగర్‌ వల్లే ఈరోజు హైదరాబాద్‌ కు తాగునీరు అందుతున్నందని తెలిపారు. మూసీని లండన్‌ థేమ్స్‌ నదిగా సుందరీకరణ చేస్తామని తెలిపారు. మూసీ రివర్‌ ప్రాజెక్ట్‌ కోసం గ్లోబల్‌ టెండర్ల పిలుస్తామన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారని.. గత ప్రభుత్వం ఔటర్‌ రింగ్‌ రోడ్డును రూ.7వేల కోట్లకు తాకట్టు పెట్టిందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *