ఇడి ముందు కాంగ్రెస్‌ ధర్నా విజయవంతం

హోమ్

మోడీ తీరుతో ఆదానీ ఆస్తులు రెట్టింపు
మండిపడ్డ తెలంగాణ మంత్రులు
హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలోని ఈడీ ఆఫీసు వద్ద కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నా విజయవంతమయ్యింది. ఈ కార్యక్రమానికి సీడబ్ల్యూసీ మెంబర్‌ సల్మాన్‌ కుర్షిద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ… ప్రధాని మోడీ నల్లధనం తెస్తానని.. పేదల ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని 15 పైసలు కూడా వేయలేదని విమర్శించారు. అదానీని మాత్రం ప్రపంచంలోనే ధనవంతులు జాబితాలో మోడీ చేర్చారన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేద్దాం
లేదంటే మోడీ ఈ దేశాన్ని నలుగురి చేతిలో పెట్టి నాశనం చేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటయ్యాయని.. లేదంటే 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్‌ గెలిచేదని పేర్కొన్నారు. మోడీని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్లపై ఈడి దాడులు జరుగుతున్నాయని.. కానీ ఆదాని అక్రమాస్తులపై ఎందుకు విచారణ జరగడం లేదని ప్రశ్నించారు. సెబీ చైర్మన్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని మరో మంత్రి శ్రీధర్‌ బాబు డిమాండ్‌ చేశారు. అదానీ ఆస్తులు అక్రమంగా పెంచడంపై న్యాయవిచారణ జరగాలన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరిపించాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం దొంగ చాటున అదానీ గ్రూపును కాపాడుతుందన్నారు.సెబి చైర్మన్‌ కుటుంబసభ్యులకు అదాని గ్రూపులో వాటాలు ఉన్నాయని.. అలాంటి వారితోనే న్యాయ విచారణనకు ఆదేశిస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేసినట్టు జేపీసీ వేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *