ఏపీలో ఇక రోడ్లకు మహర్దశ

ఆంధ్రప్రదేశ్

రిపేర్లకు ఆదేశాలు
అధికారులతో సవిూక్షించిన సిఎం చంద్రబాబు
సృజనక్రాంతి/అమరావతి : రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే పక్రియ ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రహదారులు భవనాల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం సవిూక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణం, పరిస్థితిపై ఆరా తీశారు. జగన్‌ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని, గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకురావడం లేదని అధికారులు వివరించారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 4,151 కి.విూ మేర రోడ్లపై గుంతల సమస్య ఉందన్నారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కి.విూ మేర ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోవిూటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *