మోడీ ప్రభుత్వాన్ని ఓడించటమే దేశానికి ప్రజలకు రక్ష

కార్మిక రైతాంగ నేతలు
గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె సందర్భంగా విజయవాడలో ప్రదర్శన

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించటమే దేశానికి ప్రజలకు రక్ష అని పలు కార్మిక రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె సందర్భంగా నగరంలో ప్రదర్శన సభ నిర్వహించారు ఈ ప్రదర్శన ఆటోలతో కూడా జరగడం విశేషం బిజెపిని ఓడించండి దేశాన్ని రక్షించండి అనే పిలుపుతో శుక్రవారం దేశవ్యాప్తంగా జరిగిన బంద్ సమ్మె విజయవంతం అయ్యాయి నగరంలో ఈ పిలుపుకి మద్దతుగా పాత బస్టాండ్ నుండి ప్రారంభమైన ప్రదర్శన ఏలూరు రోడ్డు మీదుగా లెనిన్ సెంటర్ కు చేరుకుంది అనంతరం అక్కడ సభ జరిగింది ఈ సభలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ రైతు ఉద్యమం సందర్భంగా మూడు నల్ల చట్టాలను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం రైతాంగం కి ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని చెప్పారు ఎం ఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించిన మోదీ స్వామినాథన్ సిఫార్సులను మాత్రం అమర చేయకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నారని వివరించారు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటానికి బిజెపి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు.
నూతన విద్యా విధానం పేరిట విద్యా వ్యవస్థను సైతం ధ్వంసం చేయాలని చూస్తోందని చెప్పారు కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ లను తెచ్చిన మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నదన్నారు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజానీకం అల్లాడుతున్నా వాటిని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టలేదని తెలిపారు.


పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ప్రపంచ మార్కెట్ తో పోలిస్తే మన దేశంలో అధికంగా వసూలు చేస్తున్నారన్నారు ఉపాధి అవకాశాలు మోడీ కాలంలో బాగా తగ్గి నిరుద్యోగం పెరిగిందని చెప్పారు ఆకలి సూచీలో మన దేశ స్థానం దిగజారడం ప్రజల పరిస్థితిని తెలియజేస్తున్నదని తెలిపారు ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించటం లేదా లీజుకు ఇవ్వటం వంటి చర్యల ద్వారా కార్పొరేట్లకు మేలు చేస్తున్నారని చెప్పారు ప్రజా సంక్షేమానికి కోతలు విధిస్తున్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటిస్తున్నదని చెప్పారు.
దేశవ్యాప్తంగా కోట్లాది పెన్షనర్లు తమ డిమాండ్లు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తన విధానాలను ప్రశ్నిస్తున్న వారిని అణిచివేయడానికి ప్రభుత్వం చూస్తున్నది అన్నారు ఢిల్లీకి చేరుకుంటున్న రైతాంగం పై గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ దాడులు దీనికి నిదర్శనమని చెప్పారు ఈ విధానాలు మారటమే దేశానికి ప్రజలకి మేలు చేస్తుందని వివరించారు బిజెపి ని దానికి మద్దతునిచ్చే పార్టీలను ఓడించి రాబోయే ఎన్నికలలో ఈ విధానాల ఓటమికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


ఈ సభకు కే దుర్గారావు ఎం సాంబశివరావు ఏ రవిచంద్ర అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వర రావు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు కే పోలారి రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై కేశవరావు ఏఐయుటియుసి నాయకులు కే సుధీర్ నాయకులు దివాకర్ వివిధ కార్మిక సంఘాల నేతలు పి అజయ్ కుమార్ సిహెచ్ బాబురావు ఏ వెంకటేశ్వరరావు ఆర్ అజయ్ కుమార్ జి కోటేశ్వరరావు ఈశ్వర్ టిఎన్టియుసి ఐఎన్టీయూసీ నేతలు ప్రదర్శన సభలలో పాల్గొన్నారు

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry