నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి భూసేకరణ

తెలంగాణ

అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలి
ఏప్రిల్‌ కల్లా భూసేకరణ పూర్తి
అధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు
హైదరాబాద్‌ : నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ఎట్టి పరిస్థితిలలో అడ్డు కాకూడదని రాష్ట్ర నీటి పారుదల ,పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎప్రిల్‌ మాసంతానికి భూసేకరణ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పురోగతి పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన సవిూక్ష సమావేశం నిర్వహించారు. నల్లగొండ లోకసభ సభ్యుడు కుందూరు రఘువీర్‌ రెడ్డి,శాసనసభ్యులు కుందూరు జయదీర్‌ రెడ్డి ,మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి లతో పాటు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌,నల్లగొండ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి,చీఫ్‌ ఇంజినీర్లు అజయ్‌ కుమార్‌,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ విషయమై రైతులతో త్వరితగతిన సంప్రదింపులు జరిపి పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదే సమయంలో అటవీశాఖ భూములకు అదనంగా చెల్లించాల్సిన చెల్లింపుల విషయమై ఆయన ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన ప్రతిపాదనలము వెంటనే పూర్తి చేయాలన్నారు. ్గªండిరగ్‌ లో ఉన్న 23 కోట్ల విద్యుత్‌ బకాయిలతో పాటు పెరిగిన విద్యుత్‌ బకాయిల ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆయన అధికారులకు చెప్పారు. అదే విదంగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి పాలనపరమైన అనుమతులు తీసుకోవడంతో పాటు మొత్తం ఐదు చెక్‌ డ్యామ్‌ లకు తక్షణమే టెండర్ల పక్రియ పూర్తి చేయాలన్నారు.ఏ.యం.ఆర్‌.పి పరిధిలోని లో లెవల్‌ కెనాల్‌ లో జంగిల్‌ కటింగ్‌ వెంటనే మొదలు పెట్టాలని ఆయన చెప్పారు. దాంతో పాటుగానే యన్‌.యస్‌.పి కెనాల్‌ పరిధిలో ఉన్న మరమ్మతులను గుర్తించి వెంటనే పనులు మొదలు పెట్టాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *