హైదరాబాద్:డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు సతీమణి నందిని ప్రజాభవన్‌లో నల్ల పోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విశిష్ఠ అతిథులుగా రాష్ట్ర మంత్రులు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డిలు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులకు భట్టి విక్రమార్క దంపతులు పుష్ప గుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు బోనం సమర్పించారు.
సిఎం ప్రత్యేక పూజలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిణి రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రాష్ట్రం విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రి కి రాష్ట్ర మంత్రులకు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్, వీర్లపల్లి శంకర్, శ్రీహరి, గణేష్, కాలే యాదయ్య, మక్కాన్ సింగ్ ఠాగూర్, ఎన్ ఉత్తం పద్మావతి, పర్ణిక రెడ్డి, మదన్మోహన్రావు, రామ్మోహన్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.