మెరుపులు.. విరుపులు.. ఆశలు.. ఆకాంక్షలు

హోమ్

9 ప్రాధాన్యత అంశాల ఆధారంగా బడ్జెట్‌
వ్యవసారంగానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై దృష్టి
స్థూలంగా బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 కోట్లు
మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు
అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు కేటాయింపు
పోలవరం పూర్తిచేసేందుకు వాగ్దానం
బీహార్‌లో మౌళిక వసతుల కల్పనలకు భారీగా కేటాయింపులు
న్యూఢల్లీ : కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు.. కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలతో ఎప్పటిలాగే ఉద్యోగుల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌పై పెద్దగా సడలింపులు లేకుండా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను ఎంపిక చేసుకుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన` నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన` ఆవిష్కరణలు, తయారీ`సేవలు, తర్వాత తరం సంస్కరణలు` ఈ తొమ్మిది అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతూ.. ఈ అంశాలను ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌ సభలో ప్రవేశ పెట్టారు. తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్‌రూపకల్పన చేసినట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ,సేవలు, తర్వాతతరం సంస్కరణలు.. ఈ తొమ్మిది సూత్రాల ప్రాధాన్యంగా తీసుకుని బడ్జెట్‌ రూపొందించినట్లు తన ప్రసంగంలో విత్త మంత్రి ప్రకటించారు. ఇక ఈ బడ్జెట్‌ మొత్తంలో వివిధ రంగాలన్నింటికి కలిపి రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అంటే స్థూలంగా బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 కోట్లు. ఇందులో మొత్తం ఆదాయాన్ని రూ.32.07 లక్షల కోట్లుగా, దానిలో పన్ను ఆదాయాన్ని రూ.28.83 లక్షల కోట్లుగా చూపించారు. ఈ ఏడాది ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా కట్టారు. అదేవిధంగా నూతన పింఛన్‌ విధానంలో త్వరలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్‌లో రైతులు,యువతపై ఎక్కువ దృష్టి పెట్టారు. యూత్‌ కు 2 లక్షల కోట్లు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. మొబైల్స్‌, బంగారంపై కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించారు. ఆదాయపు పన్ను శ్లాబులను సవరించారు. అయితే ఉద్యోగస్థులకు పెద్దగా ఉరట కల్పించలేక పోయారు. టాప్‌ 500 కంపెనీలలో కోటి మంది యువతకు 12 నెలల ఇంటర్న్‌ ఫిప్‌ అవకాశాలు కల్పించేనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్న్‌ షిప్‌ భత్యంగా నెలకు రూ.5000, వన్‌ టైమ్‌ అసిస్టెన్స్‌ కింద రూ. 6000 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక కంపెనీలు ఇంటర్న్‌ షిప్‌ వ్యయంలో 12 శాతం భరించాల్సి ఉంటుంది. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. బీహార్‌ లో విమానాశ్రయాలు, మెడికల్‌ కాలేజ్‌ లు, క్రీడల మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీహార్‌, రaార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఆందప్రదేశ్‌ రాష్టాల్రను అభివృద్ధి పరుస్తామన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15000 కోట్లను కేటాయించారు. మొబైల్‌ ఫోన్లపై, యాక్ససెరీలపై, ఛార్జర్స్‌ పై 15 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. ఉన్నత విద్య, దేశీయ సంస్థలకు రూ. 10 లక్ష ల కోట్లు కేటాయించారు. ఇకపోతే స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) లోటు 4.9 శాతం ఉండగలదన్నారు. 2025`26 ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం ఆర్థిక లోటుకే చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వచ్చే రెండేళ్లలో కోటిమంది రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. కూరగాయల ఉత్పత్తి పెద్దఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు చేశారు. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయంలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయంలో స్థిరమైన పద్ధతులు, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పెంపుదలపై దృష్టి సారించామని.. ఆ దిశగా కార్యక్రమాలు చేపడతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ తెలిపారు.అంతేకాదు.. వాతావరణ పరిస్థితులను తట్టుకునే, అధిక దిగుబడినిచ్చే ఉద్యానవన పంటలకు సంబంధించి 109 కొత్త వంగడాలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వ్యసాయ రంగానికి కేటాయించిన రూ. రాష్టాల్ర భాగస్వామ్యంతో ప్రభుత్వం వ్యవసాయానికి డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ను ప్రోత్సహిస్తుందని ప్రకటించారు. ఇక గ్రావిూణాభివృద్ధి కోసం రూ. 2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పాదతకు పెంపొందించడానికి, వాతావరణాన్ని తట్టుకోగల రకాలను అభివృద్ధి చేయడానికి వ్యవసాయ పరిశోధన శాలను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం సమగ్ర సవిూక్ష చేస్తుందన్నారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బ్జడెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. నూనెగింజల ఉత్పత్తి కోసం ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయ విలువను పెంచడం దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల మద్దతుతో పంట అనంతర కార్యకలాపాలలో పెట్టుబడులను ప్రోత్సహించడం, పాడి రైతులకు సాధికారత, నానో`డిఎపిని అన్ని వ్యవసాయ`వాతావరణ మండలాలకు విస్తరించడం, 5 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్కుల ఏర్పాటు, ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడానికి బ్లూ ఎకానవిూ 2.0 ప్రారంభం, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అమలును వేగవంతం చేయడం, 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. చిన్న రైతును దృష్టిలో ఉంచుకుని ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు. చిరు ధాన్యాలను పండిరచడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడంపైనా ఫోకస్‌ పెట్టింది.భారతదేశ వ్యవసాయ రంగం వారసత్వ సమస్యలలో కొట్టుమిట్టాడు తూనే ఉంది. ఇప్పటికీ దేశ జనాభాలో అధిక శాతం మంది ప్రజలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ, వ్యవసాయం సమర్థత లోపించి తక్కువ ఆదాయ వృత్తిగా మిగిలిపోయింది. వ్యవసాయ ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు వాణిజ్యీకరణ, వైవిధ్యీకరణ దిశగా పయనించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజలుపై ప్రధానంగా ఫోకస్‌ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతీ, యువకులకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ రంగాలపై దృష్టి సారిస్తుందని సీతారామన్‌ చెప్పారు. ఈ రంగాలలో పథకాలు, చర్యలు ` ప్రస్తుతం ఉన్నవి, ప్రకటించబోయేవి అన్నింటికి కలిపి ఐదు సంవత్సరాల వ్యవధిలో రూ. 2 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ªూనున్న ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌లకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో బుద్ధగయ, రాజ్‌గిర్‌, వైశాలి, దర్భంగాలలో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. బీహార్‌లో వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లను బడ్జెట్‌ ప్రతిపాదించింది. బీహార్‌కు బహుపాక్షిక అభివృద్ధి సంస్థల సహాయంతో ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పారు. బీహార్‌లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడిరచారు. బీహార్‌లోని పీర్‌పైంటిలో 2400 మెగావాట్ల కొత్త పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్‌ ప్రాజెక్టులను రూ.21,400 కోట్లతో చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హావిూలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రాష్ట్ర రాజధాని ఆవశ్యకతను గుర్తించి, బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 15,000 కోట్లు కేటాయించబడతాయన్నారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు సమకూర్చి పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ క్రమంలో బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఆంధప్రదేశ్‌ల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం ’పూర్వోదయ’ పథకాన్ని కూడా తీసుకురానుంది. తూర్పు ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని సీతారామన్‌ చెప్పారు.
బంగారం, సెల్‌ఫోన్లపై సుంకాల తగ్గింపు
బంగారం, వెండితో పాటు మొబైల్‌ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్‌ డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బంగారం, వెండిపైన కస్టమ్స్‌ సుంకాన్ని ఆరు శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ`కామర్స్‌పై టీడీఎస్‌ను కూడా తగ్గించారు.ఆరు నెలల్లో కస్టమ్స్‌ సుంకం విధానాన్ని సమగ్రంగా సవిూక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 1961 నాటి ఆదాయ పన్ను చట్టాన్ని కూడా సమగ్రంగా రివ్యూ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
విద్యారంగానికి భారీగా కేటాయింపులు
ఉన్నత విద్యకు 3శాతం వడ్డీతో రుణాలు
విద్యాశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసింది. విద్య, ఉద్యోగ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగాలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా పథకాలు ప్రకటించింది. మొత్తంగా 5 స్కీమ్‌లు అమలు చేస్తామని నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. మొత్తంగా రూ.2 లక్షల కోట్ల కేటాయింపులు చేసింది. ఉద్యోగాల కల్పనకు సంబంధించి మొత్తం మూడు పథకాలు అమలు చేస్తామని తెలిపారు. నైపుణ్య శిక్షణపైనా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. విద్యారంగానికి తోడ్పాటునిచ్చేందుకు వీలుగా దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే వాళ్లకు రూ. 10 లక్షల వరకూ లోన్‌ ఇస్తామని కీలక విషయం వెల్లడిరచారు. ఏటా అర్హులైన 25 వేల మంది విద్యార్థులకు ఈ రుణం అందించేలా ప్రణాళికలు రచించినట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. దేశీయ విద్యాసంస్థల్లో చదువుకునే వారికి మాత్రమే ఈ స్కీమ్‌ వర్తించనుంది. ఏటా లక్ష మంది విద్యార్థులకు 3శాతం వడ్డీతో రూ. 10 లక్షల రుణం అందిస్తామని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్‌. మహిళలపైనా ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. మోడల్‌ స్కిల్‌ లోన్‌ స్కీమ్‌ ద్వారా రూ.7.5 లక్షల వరకూ లోన్‌ ఇచ్చేలా భరోసా కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఏటా ఈ పథకం ద్వారా 25 వేల మందిలి లబ్ది చేకూరుస్తామని వెల్లడిరచింది.
గృహ నిర్మాణాలకు ప్రోత్సాహం
సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పట్టణ పేదలు, మధ్యతరగతి జీవులకు బడ్జెట్‌ 2024`25లో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ’ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన`అర్బన్‌ 2.0’ పథకం కింద ఏకంగా కోటి మందికి గృహ రుణాలు ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో 1 కోటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ప్రయోజనాన్ని అందించనునన్నట్టు వివరించారు. పట్టణ ప్రజల గృహ అవసరాలను గుర్తించామని, ఈ మేరకు అర్బన్‌ హౌసింగ్‌ ద్వారా సమస్యను పరిష్కరించనున్నట్టు వివరించారు. ఈ పథకం కింద రానున్న ఐదు సంవత్సరాల్లో మరో రూ. 2.2 లక్షల కోట్లు కేంద్ర సాయం అందుతుందని ఆమె చెప్పారు. మరోవైపు ముద్ర పథకం కింద రుణ పరిమితిని కూడా పెంచుతున్నట్టు సీతారామన్‌ ప్రకటించారు. అంతేకాకుండా చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు మరింత సులభంగా ఆర్థిక సాయాన్ని పొందేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని సీతారామన్‌ స్పష్టం చేశారు. తద్వారా కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు లేదా విస్తరించేందుకు వీలు కల్పిస్తామని, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు కేంద్రం దోహదపడుతుందని సీతారామన్‌ వివరించారు. కాగా రికార్డు స్థాయిలో సీతారామన్‌ వరసుగా ఏడవసారి కేంద్ర బ్జడెట్‌ 2024`25ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.48.21 లక్షల కోట్లు బ్జడెట్‌ను ప్రకటించారు. మొత్తం
ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆధారిత ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని బ్జడెట్‌లో కేంద్రం అంచనా వేసింది. ఇక అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ16 లక్షల కోట్లుగా లెక్కగట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *