‘ధూం ధాం’ నుంచి ‘టమాటో బుగ్గల పిల్ల..’ సాంగ్‌ విడుదల

ఫ్రైడే ఫ్రేమ్‌ వరక్స్‌ బ్యానర్‌లో చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. ఈ చిత్రాన్ని ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. సాయి కుమార్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీరాజ్‌, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ధూం ధాం‘ సినిమాను లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా దర్శకుడు సాయి కిషోర్‌ మచ్చా రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ‘ధూం ధాం’ సినిమా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ సక్సెస్‌ ఫుల్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’, ‘మాయా సుందరి..’ పాటలు పాట ఛాట్‌ బస్టర్స్‌ అయ్యాయి. థర్డ్‌ సింగిల్‌ ‘టమాటో బుగ్గల పిల్ల..’ లిరికల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించగా.. గోపీ సుందర్‌ బ్యూటిఫుల్‌ గా కంపోజ్‌ చేశారు. శ్రీకృష్ణ, గీతా మాధురి ఆకట్టుకునేలా పాడారు. ‘ఎట్టెట్టగున్నా నువ్వు భల్లేగుంటావే…ఏ మాయో చేసి నన్ను గిల్లేస్తుంటావే..బంగారం గానీ తిన్నావా నువ్వు బబ్లీగా ముద్దొస్తుంటావే..బంగాళాఖాతం చెల్లెల్లా నన్ను అందంతో ముంచెస్తుంటావే.. టమాటో బుగ్గల పిల్ల..’ అంటూ సాగుతుందీ పాట. కలర్‌ ఫుల్‌ డ్యూయెట్‌ గా ’టమాటో బుగ్గల పిల్ల..’ పాటను రూపొందించారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry