ఘనంగా విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం

విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం ఆగస్ట్ 29న ఘనంగా జరిగింది. విశాల్, ధన్సిక ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఎంగేజ్మెంట్ ఫోటోల్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నేడు మా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.. అందరి ఆశీర్వాదం మాకు కావాలి అంటూ సోషల్ మీడియాలో విశాల్ తాజాగా వేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే పెళ్లికి సంబంధించిన ఇతర వివరాల్ని విశాల్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం విశాల్, ధన్సిక ఎంగేజ్మెంట్ సందర్భంగా కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు విషెస్ అందిస్తున్నారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry