‘మీసాల పిల్లా’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదల

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ నుండి దసరా నాడు విడుదలైన ‘మీసాల పిల్లా’ సాంగ్‌ ప్రొమో ఎంతో అలరించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత చిరంజీవి Ê ఉదిత్‌ నారాయణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్‌. ఈ సాంగ్‌ ఫుల్‌ లిరికల్‌ వీడియో ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఈ చిత్ర యూనిట్‌ ‘మీసాల పిల్లా’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట లిరిక్‌ వింటుంటే విడిపోయి మళ్లీ కలవబోయే భార్యాభర్తల మధ్య సరదాగా సాగే కీచులాటలను చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మాస్టర్‌ విజయ్‌ పొలాకీ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో ఎప్పటిలాగే చిరంజీవి తన డాన్సులో ఉన్న గ్రేస్‌తో అలరించడం జరిగింది. చిరుకి జోడీగా నయనతార సైతం తన స్టెప్పులతో అలరించారు. భాస్కర భట్ల ఈ పాటను రచించగా, ఈ సినిమాకు భీమ్స్‌ సంగీతాన్ని అందించడం జరిగింది.