కోదాడలో మాంగళ్యషాపింగ్ మాల్ 33వ శాఖ గొప్ప ప్రారంభం

మాల్ ప్రారంభించిన సినీ హీరోయిన్ ఆషిక రంగనాథ్
సృజనక్రాంతి/కోదాడ: 2012లో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ప్రారంభమైన మాంగళ్యషాపింగ్ మాల్, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల ఆదరణను పొందిన మాంగళ్య, ఇప్పటికే తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తన ఉనికిని చాటింది. ఈ క్రమంలో కోదాడలో 33వ శాఖను బుధవారం గొప్పగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి ఆషిక రంగనాధ్ ముఖ్య అతిధిగా హాజరై దీప ప్రజ్వలనచేసి మాల్ ప్రారంభించారు. అనంతరం మాల్ వివిధ విభాగాలను సందర్శించి, అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. రిబ్బన్ కటింగ్ అనంతరం నటి ఆషికా రంగనాధ్ మాట్లాడుతూ కోదాడ ప్రజలు మాంగళ్య షాపింగ్ మాలకు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉంది. వారి ఆశీర్వాదాలతో ఈమాల్ మరింత విజయవంతమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నంబాబు లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మాంగళ్యషాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశివాయ, కాసం మల్లిఖార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ లు మాట్లాడుతూ ప్రతి వర్గానికి ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే మా విజయ రహాస్యం అని తెలిపారు. తమస్వంత హ్యాండ్ ఉత్పత్తులను ఆధునిక మార్కెట్ ట్రెండ్స్ అనుగుణంగా డిజైన్ చేసి వస్త్ర వ్యాపారంలో ముందంజలో కొనసాగుతున్నామని తెలిపారు. మాంగళ్య షాపింగ్ మాల్ మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాషన్ కలెక్షన్స్, అలాగే వివాహాలు, శుభకార్యాలకు ప్రత్యేకమైన భారీ వెడ్డింగ్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయి. ఈ మాల్ ప్రారంభంతో కోదాడ ప్రజలు ఇకపై పెళ్లి షాపింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ప్రాంతంలోనే నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చని అన్నారు. రూ.99 నుంచి ప్రారంభమై రూ.లక్ష వరకు ధరల శ్రేణిలో వస్త్రాలు అందుబాటులో ఉండటంతో పాటు మాంగళ్య ఒక సంపూర్ణ ఫ్యామిలి షాపింగ్ మాల్ ప్రత్యేక గుర్తింపు పొందింది. కోదాడ ప్రజలు తమ తమ శుభ కార్యక్రమం ఏది ఉన్నప్పటికీ ఒకసారి మాంగళ్యషాపింగ్ మాల్ సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఒక నూతన షాపింగ్ ఒరవడి సృష్టించాలని డైరెక్టర్లు కోరారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *