కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

కాళేశ్వరం విస్తరణకు శంకుస్థాపన
రూ.198 కోట్లతో ఆలయ అభివద్ధి పనులకు శ్రీకారం
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రూ.198 కోట్లతో చేపట్టబోయే ఆలయ అభివద్ధి పనులకు సీఎం భూమిపూజ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అభివద్ధి , మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులపై ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా దష్టి సారించారు. కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న వివిధ అభివద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరం క్షేత్రాన్ని మరింత అభివద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ తిదితరులు పాల్గొన్నారు. ఆలయ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, ప్రస్తుత స్థితిగతులు , పునరుద్ధరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారేజ్ మరమ్మత్తులు ఎంతవరకు వచ్చాయి, వర్షాకాలం లోపు చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సవిÖక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు భద్రత , భవిష్యత్తు కార్యాచరణపై ఈ పర్యటన ద్వారా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటన దష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు , ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry