సిఎంను కలిసిన యూనిసెఫ్ ప్రతినిధి
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేపట్టాలని ఈ సందర్భంగా డీజీ డాక్టర్ జాక్వెలిన్ హ్యూకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. ఇక్రిశాట్‌ను ఓ సారి సందర్శించాలంటూ జాక్వెలిన్ చేసిన విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సాధ్యమైనంత త్వరలో ఇక్రిశాట్‌ను సందర్శిస్తానని డీజీ డాక్టర్ జాక్వెలిన్‌కు సీఎం రేవంత్ రెడ్డి హావిూ ఇచ్చారు. ఇదిలావుంటే సిఎం రేవంత్‌ను సచివాలయంలో యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ జెలెలమ్ బి. టఫెస్సీ మర్యాదపూర్వకంగా కలిశారు.